Ayurvedic Diet Plan: మానవ శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు తప్పకుండా రోజు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందుకే ఆహారపు అలవాట్ల గురించి ఆయుర్వేద శాస్త్రంలో క్లుప్తంగా వివరించారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా భోజనం చేసిన తర్వాత కొన్ని ఆహారాలు తినడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేదంటే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి తిన్న తర్వాత కొన్ని ఆహారాలు, డ్రింక్స్‌ తీసుకోకూడదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పండ్లు:
పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదనైప్పటికీ ఆహారాలు ప్రతి రోజు తీసుకునే క్రమంలో వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయిని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే పండ్ల ఎంజైమ్‌లు విచ్ఛిన్నమై ఆహారంతో కలిసిపోయి కడుపు సమస్యలను కలిగిస్తాయి. దీని కారణంగా కొంతమందిలో తీవ్ర జీర్ణక్రియ సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. 


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    


చల్లని నీరు:
ప్రస్తుతం చాలా మంది ఆహారాలు తీసుకున్నప్పుడు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన చల్లని నీరు ఆరోగ్యాని మంచిదని తాగుతున్నారు. ఇలా ప్రతి రోజు తాగడం వల్ల కడుపులో ఉత్పత్తి అయ్యే డైజెస్టివ్ ఎంజైమ్‌లు పొట్ట చల్లగా చేసి, జీర్ణక్రియ వ్యవస్థను స్తంభించేందుకు సహాకరిస్తుంది. అంతేకాకుండా ఆహారంలోని పోషకాలు శరీరం గ్రహించడం మానుకుంటుంది. దీని కారణంగా పోషకలోపం వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి తిన్న వెంటనే చల్లటి నీటిని తాగడం మానుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.



హెర్బల్ టీ తాగడం:
వేడి ఆహారాలు తీసుకున్న తర్వాత హెర్బల్ టీలు అతిగా తీసుకుంటున్నారు. ఇలా వేడి ఆహారాలు తీసుకున్న వెంటనే హెర్బల్ టీలను తీసుకోవడం వల్ల తీవ్ర జీర్ణక్రియ సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు పొట్టలో ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా పెరిగిపోతాయి. కాబట్టి ఆహారాలు తీసుకున్న వెంటనే హాట్ డ్రింక్స్‌ తాగడం మానుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook