Weight Loss Home Treatment: హడావిడి జీవనశైలి ..అస్తవ్యస్తమైన ఆరోగ్యపు అలవాట్లు.. జంక్ ఫుడ్.. ఇలా ఎన్నో కారణాలవల్ల ఉబకాయం అనేది సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎందరో ఊబకాయంతో బాధపడుతున్నారు. అధిక బరువు ఉండటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు కూడా విపరీతంగా తలెత్తుతాయి. దీనికి తోడు నలుగురిలో హాయిగా కలవలేక చాలామంది ఆత్మనుణ్యతతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బరువు తగ్గించుకోవడం కోసం పలు రకాల డైట్లు, ఎక్ససైజ్లు చేస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్ని చేసినా కొందరిలో ఫలితాలు కనిపించవు. మరికొందరిలో కాస్త ఫలితం ఉన్నా అది తాత్కాలికంగా ఉంటుంది. నచ్చింది ఒక్కరోజు తింటే వారం రోజులు చేసిన డైటింగ్ గాల్లో కలిసిపోతుంది. ఇలా బాధపడుతున్న వారికి సులభంగా ఇంటి వద్దనే బరువు తగ్గించే ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. మరి అవి ఏమిటో? ఎలా వాడాలో ?తెలుసుకుందాం పదండి. వీటి కోసం ప్రత్యేకించి మనం ఎటువంటి ఖర్చు చేయక్కర్లేదు ఇవి సులభంగా మన వంటింట్లోనే దొరుకుతాయి.


మెంతులు:


మన వంటింటి పోపులో పెట్టిలో నిత్యం కనిపించే వస్తువు మెంతులు. సాధారణంగా విరోచనాలకు, కడుపునొప్పికి నివారణగా మెంతులని మనం ఉపయోగిస్తాం. రోజు నానబెట్టిన మెంతులు పరగడుపున తీసుకోవడం వల్ల మధుమేహం కూడా తగ్గుతుంది. అయితే ఇలా రాత్రంతా నానబెట్టిన మెంతులను తినడం వల్ల ..ఆ నీటిని తాగడం వల్ల కడుపులో ఎప్పటినుంచో పేర్కొన్న చెత్త మొత్తం తొలగిపోతుంది. క్రమం తప్పకుండా రోజు ఇలా నానబెట్టిన మెంతులు తీసుకునే వారు బరువు కూడా తగ్గుతారు.


త్రిఫల చూర్ణం:


త్రిఫల చూర్ణం లేదా త్రిఫల పొడి మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. రోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి నీటిలో ఇది ఒక చెంచా కలుపుకొని తాగడం వల్ల జీవక్రియ మెరుగు పడుతుంది. కడుపులో పేరుకుపోయిన వ్యర్ధాలు సులభంగా తొలగడమే కాకుండా బాడీ బాగా డిటాక్సిఫై అవుతుంది. జీర్ణవ్యవస్థ బలోపేతం అవ్వడంతో పాటు ఊబకాయం కూడా సులభంగా తగ్గుతుంది.


జీలకర్ర:


తిరగమాత దినుసుగా మనం చూసే ఈ జీలకర్ర తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత ఎన్నో సమస్యలు తగ్గుతాయి. మనం తీసుకున్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో జీలకర్ర బాగా పని చేస్తుంది.  ఒక గ్లాసు నీటిలో కాస్త జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని బాగా కాచి..వడగట్టుకుని..గోరువెచ్చగా తాగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సంబంధిత సమస్యలు అన్ని తగ్గడమే కాకుండా అధిక బరువు నియంత్రణలో ఉంటుంది.


Also Read: సీఎంగా ఎన్నికై 100 రోజులు కూడా కాలే.. అప్పుడే రేవంత్‌ రెడ్డికి గుడి


Also Read: బీఆర్ఎస్, బీఎస్పీల మధ్య కుదిరిన పొత్తు.. తెలంగాణ పాలిటిక్స్ లో మరో కీలక పరిణామం..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter