Bad Cholesterol: మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా?
Bad Cholesterol: శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగిపోవడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం చాలామంది గుండెపోటు, రక్తపోటు సమస్యల బారిన పడటానికి ప్రధాన కారణం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో కొవ్వు పెరగడం కారణంగా మధుమేహం కూడా వస్తోంది. కాబట్టి ఇప్పటికే చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా బాహ్య శరీరంపై అనేక మార్పులు వస్తాయి. ఈ లక్షణాలను ముందుగానే గమనించి వైద్యుల సూచనల మేరకు కొన్ని హోమ్ రెమెడీస్ వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అయితే చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా వచ్చే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా వచ్చి ప్రధాన లక్షణాలు:
ఎటువంటి లక్షణాలు ఉండవు:
కొంతమందిలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా ముందుగా ఎలాంటి లక్షణాలు ఉండకపోయినా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. దీనినే వైద్య పరిభాషలో సైలెంట్ కిల్లర్ కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా కొంతమందిలో ఎలాంటి లక్షణాలు ఉండనప్పటికీ శరీరం లోపల మాత్రం కొవ్వు పేరుకుపోయి ఉంటుంది.
కంటి చూపు సమస్యలు:
చాలామందిలో కంటిచూపు సమస్యలు వస్తూ ఉంటాయి. నిజానికి కంటి చూపుకి కొలెస్ట్రాల్ కి ఎలాంటి సంబంధం లేకపోయినా.. కొంతమందిలో మాత్రం కళ్ళు పచ్చగా మారుతూ ఉంటాయి. అయితే దీనికి ప్రధాన కారణం శరీరంలోని కొలెస్ట్రాల్ పేరుకుపోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగితే కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి.
చర్మం పై రంగు:
చాలామందిలో చర్మం పై రంగు సాధారణంగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో పసుపు లేత రంగులోకి మారుతుంది. నిజానికి ఇలా పసుపు లేత రంగులోకి మారడం వల్ల కూడా శరీరంలోని కొలెస్ట్రాల్ పెరగడానికి ఒక లక్షణమేనని ఆరోగ్యనిపుణులు భావిస్తున్నారు.
పాదాల్లో నొప్పి:
కొంతమందిలో తరచుగా పాదాల్లో నొప్పి, కీళ్లనొప్పులు వస్తూ ఉంటాయి. అయితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాదాల్లో నొప్పులు వస్తే తప్పకుండా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం ఎంతో మంచిది.. లేకపోతే ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.
త్వరగా అలసిపోవడం:
కొంతమంది ఒక 100 అడుగులు వేయగానే అలసిపోతూ ఉంటారు. నిజానికి ఇలా అలసిపోవడం కూడా కొలెస్ట్రాల్ ప్రధాన లక్షణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే తరచుగా అలసిపోయేవారు కూడా కొలెస్ట్రాల్ టెస్టు చేయించుకుంటే ఎంతో మంచిది. లేకపోతే గుండె సమస్యలే బారిన పడే అవకాశాలున్నాయి.
గుండె నొప్పి:
కొంతమందిలో గ్యాస్టిక్ కారణంగా కాకపోయినా ఇతర కారణాల వల్ల కూడా గుండె నొప్పులు వస్తాయి. అయితే ఈ నొప్పి రావడానికి ప్రధాన కారణం కొలెస్ట్రాలేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా గుండె నొప్పితో పాటు ఒక్కొక్కసారి శ్వాస ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.