Baking Powder Cleanser: బేకింగ్ సోడాను వంటకాలను రుచిగా చేయాడానికి వినియోగిస్తారు. ముఖ్యంగా బేకింగ్‌ ఫుడ్‌లో అధిక పరిమాణంలో వినియోగిస్తారు. అయితే దీనిని వినియోగించి క్లీనింగ్‌ కూడా చేయోచ్చని పలు నివేదికలు పేర్కొన్నారు. అయితే సోడాను వివిధ వస్తువులను శుభ్రం చేయడానికి వినియోగిస్తారు. దీనిని వాడి క్లీన్‌ చేయడం వల్ల పాత వస్తువులు ప్రకాశవంతంగా మెరుస్తాయి. ఇది బట్టలకు అంటిన జిడ్డు మరకలను కూడా ప్రభావవంతంగా తొలగిస్తుంది. అయితే ఇందులో ఉండే గుణాలు ఇతర వస్తువులను ఎలా శుభ్రం చేస్తుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే చాలా మంది బేకింగ్‌ సోడాను వినియోగించి శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ ఇందులో కొంచెం వెనిగర్ వేసి వస్తువులను  కూడా శుభ్రం చేయవచ్చు. అయితే ఈ బేకింగ్ సోడాతో ఏయే వస్తువులను శుభ్రం చేయవచ్చో తెలుసుకుందాం.


బేకింగ్ సోడా ఉపయోగాలు:


1. బేకింగ్ సోడాను నీటిలో వేసి బాగా కలుపుకుని.. మనం రోజూ వినియోగించే స్టవ్వులను, పొయ్యిని బాగా శుభ్రం చేయవచ్చు దీని శుభ్రం చేయడం వల్ల అది కొత్తగా తయారవుతుంది.


2. తివాచీలు, కర్టెన్లను కూడా బేకింగ్‌ సోడాను వినియోగించి శుభ్రం చేయోచ్చు.  అయితే వీటిని శుభ్రం చేయడానికి ముందుగా కొద్దిగా వేడినీరు, బేకింగ్ సోడా, మంచి ఫాబ్రిక్ క్లీనర్ మిశ్రమంగా ఏర్పాటు చేసుకుని. దీనితో అన్ని కర్టెన్లు, కార్పెట్లను శుభ్రం చేసుకుంటే.. తళతళలాడుతుంది.


3. ఈ మధ్య నీరు కలుషితం కావడంతో షవర్‌లో మట్టి, దుమ్ము పేరుకుపోతోంది. అయితే దీనిని శుభ్రం చేసే క్రమంలో  బేకింగ్ సోడాను ఉపయోగిస్తే.. షవర్‌ మెరవడమేకాకుండా వీటిలో దుమ్ము రాకుండా ఉంటుంది.  


4. గాజు మగ్‌లను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాను వినియోగించవచ్చు. దానిలో కొంచెం బేకింగ్ సోడా చల్లి, గుడ్డతో తుడవండి. ఇలా చేస్తే మగ్‌ ఇతర వస్తువులు ముత్యంలా తళతళ మెరుస్తాయి.


5. డ్రెయిన్, లాండ్రీ వంటి వస్తువులను కూడా బేకింగ్ సోడా ఉపయోగించి పూర్తిగా శుభ్రం చేయవచ్చు. దీని వల్ల అన్ని మరకలు తొలగిపోతాయి.


6. బేకింగ్ సోడాతో సింక్, ఫ్రిజ్, ట్యాపర్ వేర్‌లను కూడా శుభ్రం చేయడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు.


Read also: Paratha Recipe: ఉదయాన్నే దీనితో చేసిన పరాటా తింటే.. రోజంతా శరీరం అక్టివే..!


Read also: Heavy Rains: కుండపోత వానలతో తెలంగాణ అతలాకుతలం.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook