Bhagavanth Kesari: మూడు దశాబ్దాల తరువాత మళ్లీ అలాంటి రికార్డ్ పై కన్నేసిన బాలకృష్ణ
Nandamuri Balakrishna: 30 ఏళ్ళు.. 47 సినిమాలు చేశారు బాలకృష్ణ కానీ ఈ 30 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఆయనకు వరుసగా రెండు హిట్టు రాలేదు. అంటే దాదాపు రెండు వరస హిట్లు తెచ్చుకోవడానికి 30 సంవత్సరాల సమయం తీసుకున్నారు మన బాలయ్య.
Nandamuri Balakrishna: ప్రస్తుతం సినిమాల పరంగా నందమూరి బాలకృష్ణ యమ జోరు పైన ఉన్నారు. వరసగా సూపర్ హిట్లు సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఎంతో కాలం స్టార్ హీరోగా కొనసాగిన బాలకృష్ణకి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత చాలా రోజులు హిట్లు రాలేదు. ఫైనల్ గా లక్ష్మీనరసింహ సినిమాతో ఒక మోస్టార్ హిట్ అందుకున్నారు బాలయ్య. ఇక ఆ తరువాత బాలకృష్ణ సినిమాలలో మనకి గుర్తుంది పోయే చిత్రాలు అంటే సింహ, లెజెండ్.
అనగా బోయపాటి సినిమాలు మినహా.. వేరే ఏ డైరెక్టర్ తోను బాలయ్య సూపర్ హిట్ లు సాధించలేకపోయాడు. గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ లాంటి చిత్రాలు మాత్రం పరవాలేదు అనిపించుకున్నాయి. ఇక బాలకృష్ణ సినిమాలకు దూరం కావడం మేలు అనుకున్న తరుణంలో వచ్చిన చిత్రం అఖండ. ఈ సినిమాకి కూడా బోయపాటి దర్శకుడు అయినప్పటికీ.. ఈ సినిమాతో మళ్లీ బాలకృష్ణ పుంజుకున్నారు. అదే సమయంలో ఆహాలో అన్ స్టాపబుల్ షో తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక అదే జోరు కొనసాగిస్తూ ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసారు బాలకృష్ణ. తన రాబోయే సినిమా భగవంత్ కేసరితో ఎలా అయినా వరుసగా మూడు హిట్లు సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారు.
కానీ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే.. దాదాపు 30 సంవత్సరాల తరువాత ఇలాంటి రికార్డ్ బాలకృష్ణ అందుకోవడం. 30 ఏళ్ళు.. 47 సినిమాలు చేశారు బాలకృష్ణ కానీ ఈ 30 సంవత్సరాల లో ఎప్పుడు కూడా ఆయనకు వరుసగా రెండు హిట్టు రాలేదు. అంటే దాదాపు రెండు వరస హిట్లు తెచ్చుకోవడానికి 30 సంవత్సరాల సమయం తీసుకున్నారు మన బాలయ్య. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఒకసారి ఈ 30 సంవత్సరాల లో బాలకృష్ణ తీసిన 47 సినిమాలు లిస్టు చూస్తే మీకు అర్థమయిపోతుంది.
సమరసింహారెడ్డి తర్వాత వచ్చిన సుల్తాన్ యావరేజ్ దగ్గరే ఆగింది కానీ హిట్ కాదు.చివరగా 1993-94 సమయంలో బంగారు బుల్లోడు, భైరవ ద్వీపంతో వరస హిట్స్ అందుకున్నారు బాలయ్య. మరి ఇన్ని రోజులకు మళ్లీ ఒక హ్యాత్రీక్ ని భగవంత్ కేసరి సినిమాతో మన బాలకృష్ణ అందుకునే అవకాశం ఉంది. అందులో ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
మొత్తానికి వరసగా రెండు హిట్లు అనే లోటు ఇన్నేళ్లకు అఖండ, వీరసింహారెడ్డిలతో తీర్చిన బాలయ్య ఫైనల్ గా ఇదే జోరులో హ్యాత్రిక్ కూడా అందుకునేస్తారేమో తెలియాలి అంతే మాత్రం అక్టోబర్ 19 వరకు వేచి చూడాల్సిందే. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్, శ్రీ లీల లాంటివారు నటించడం ఈ సినిమాకి మరో మేజర్ ప్లస్ పాయింట్.
Also Read: Bandi Sanjay: తెలంగాణ ప్రజల కొంప ముంచిన 'చేపల పులుసు': బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి