COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Banana Top Secret Benefits: శరీరాన్ని దృఢంగా ఆరోగ్యం ఉంచేందుకు అరటి పండు దివ్యౌషధంలా పని చేస్తుంది. అరటిలో అధిక పరిమాణంలో కాల్షియం, సోడియం, ఫైబర్, విటమిన్ సి, ఐరన్‌లు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో జీరో ఫ్యాట్ లెవల్స్‌ ఉంటాయి. కాబట్టి ఇది శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది. అరటి పండ్లను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి కాకుండా చర్మానికి, జుట్టుకు కూడా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని ప్రతి రోజు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

ప్రతి రోజు అరటిపండ్లను తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో శక్తి లభిస్తుంది. అంతేకాకుండా అరటిలో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. 


శరీర బరువును తగ్గిస్తుంది:
బరువు తగ్గాలనుకునేవారు డైట్‌లో అరటిపండును తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఇందులో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఆకలిని నియంత్రించి, జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?


మధుమేహంతో బాధపడుతున్నవారు కూడా తినొచ్చు:
మధుమేహంతో బాధపడేవారికి అరటి పండ్లు ఔషధంలా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఫైబర్, విటమిన్లు, స్టార్చ్, ఫైటోకెమికల్స్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి టైప్ 2 డయాబెటిస్‌తో పోరాడడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రణలో ఉంచుతుంది. 


ఒత్తిడి:
ఒత్తడి కారణంగా చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి కూడా అరటిపండ్లు ప్రభావంతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు  రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల గుండెకు చాలా రకాల లాభాలు కలుగుతాయి. 


మలబద్ధకం:
మలబద్ధకం కారణంగా చాలా మందిలో తీవ్ర పొట్ట సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలకు అరటిపండు ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను కూడా మెరుగుపరుచుతాయి. 


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి