Beauty Tips: కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడటం ఇటీవలి కాలంగా చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. కళ్లు ఎంత అందంగా ఉన్నా..కంటి కింద డార్క్ సర్కిల్స్ ఉంటే మొత్తం అందాన్ని నాశనం చేస్తాయి. అయితే బాదం ఆయిల్ మాస్క్‌తో ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. బాదం ఆయిల్ మాస్క్ అప్లై చేస్తే కంటి కింద ఏర్పడే డార్క్ సర్కిల్స్ నుంచి విముక్తి పొందవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా చేయాలనే వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాదం ఆయిల్ మాస్క్ తయారీకు కావల్సిన వస్తువులు


1. ఒక స్పూన్ బాదం నూనె
2. అర స్పూన్ నిమ్మరసం


బాదం ఆయిల్ మాస్క్ ఎలా తయారు చేయాలి


బాదం ఆయిల్ మాస్క్ తయారుచేసేందుకు ముందుగా చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ బాదం ఆయిల్, అర స్పూన్ నిమ్మరసం వేయాలి. ఈ రెండింటినీ బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. అంతే మీకు కావల్సిన బాదం ఆయిల్ మాస్క్ తయారైనట్టే.


బాదం ఆయిల్ మాస్క్ ఎలా అప్లై చేయాలి


బాదం ఆయిల్ ఐ మాస్క్ అప్లే చేసేముందు ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కంటి కింద బాగా అప్లై చేయాలి. కాస్సేపు అలా ఉంచేయాలి. అనంతరం కాటన్ లేదా నీళ్లతో శుభం చేసుకోవాలి. వారానికి కనీసం రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి.


Also Read: Vitamins for Women: ఈ 5 విటమిన్లు ఉంటే అందం, ఆరోగ్యం రెండూ అమ్మాయిల సొంతం, ఎలాంటి డైట్ తీసుకోవాలి


Also Read: Best Smartphone Under 1000: రూ.11 వేల పోకో స్మార్ట్‌ఫోన్ రూ. 549కే.. కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్న జనాలు!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook