Healthy Beetroot Rice Recipe In Telugu: చాలామంది పిల్లలు బీట్రూట్ తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఇది నోటికి సరైన రుచిని కలిగి ఉండకపోవడంతో చాలామంది జ్యూస్‌లా తయారు చేసుకుని తాగుతారు. క్రమం తప్పకుండా బీట్రూట్‌ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషక గుణాలు రక్తపోటు సమస్య నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. ప్రతిరోజు ఉదయం అల్పాహారానికి ముందు బీట్రూట్‌ని తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు బీట్రూట్ తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే ఇందులో ఉండే ఔషధ గుణాలు జ్ఞాపక శక్తిని పెంచేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా తరచుగా శరీరంలోని రక్త సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు బీట్రూట్‌ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే శరీరానికి పోషకాలను అందించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన బీట్రూట్ ని చాలామంది తినేందుకు వెనకడుగు వేస్తారు. అయితే వారికోసం మేము ఈరోజు ఒక ప్రత్యేక రెసిపీని పరిచయం చేయబోతున్నాం. ఈ రెసిపీని సమంత తప్పకుండా తీసుకోవడం వల్ల పుష్కలమైన పోషకాలు పొందడమే కాకుండా ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఆ రెసిపీ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


బీట్రూట్ రైస్ రెసిపీ కావాల్సిన పదార్థాలు:
❃ బియ్యం - 1 కప్పు
❃ బీట్రూట్ - 1 ( తురిమిన)
❃ పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగిన)
❃ అల్లం - 1/2 అంగుళం (తరిగిన)
❃ జీలకర్ర - 1/2 టీస్పూన్
❃ ఆవాలు - 1/2 టీస్పూన్
❃ కరివేపాకు - 1 రెమ్మ
❃ పసుపు - 1/4 టీస్పూన్
❃ మిరపకాయ పొడి - 1/2 టీస్పూన్
❃ గరం మసాలా - 1/4 టీస్పూన్
❃ నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
❃ ఉప్పు - రుచికి సరిపడా


తయారీ విధానం:
❃ ముందుగా ఒక బౌల్లో బియ్యాన్ని వేసుకొని మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. 30 నిమిషాల పాటు నానబెట్టండి.
❃ ఆ తరువాత స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని అందులో. నెయ్యి వేడి చేసి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి.
❃ బాగా వేగిన తర్వాత, పచ్చిమిర్చి, అల్లం వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
❃ ఆ తర్వాత అదే కళాయిలో తురిమిన బీట్రూట్ వేసి, 2-3 నిమిషాలు సన్నని మంటపై వేయించాలి.
❃ అన్ని బాగా వేగిన తర్వాత పసుపు, మిరపకాయ పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
❃ ఆ తర్వాత ఆ కళాయిలో నానబెట్టిన బియ్యం, ఉప్పు వేసి బాగా కలపాల్సి ఉంటుంది. 
❃ తర్వాత అందులోనే 2 కప్పుల నీరు పోసి, మూత పెట్టి, బియ్యం ఉడికే వరకు బాగా ఉడికించాలి.
❃ బియ్యం ఉడికిన తర్వాత, మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
❃ చివరగా, కొత్తిమీరతో అలంకరించి, వేడిగా వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యం పొందడం ఖాయం.


చిట్కాలు:
❃ ఈ బీట్రూట్ రైస్ ను మరింత రుచిగా పొందడానికి 1 టేబుల్ స్పూన్ పెరుగు లేదా నిమ్మరసం వేయవచ్చు.
❃ మీరు ఈ రెసిపీలో క్యారెట్, బఠానీలు వంటి ఇతర కూరగాయలను కూడా వినియోగించుకోవచ్చు.
❃ బీట్రూట్ రైస్ ను పెరుగు లేదా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!


బీట్రూట్ రైస్ ప్రయోజనాలు:
❃ బీట్రూట్ రైస్  చాలా పోషకాలు లభిస్తాయి. ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
❃ తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనతను సులభంగా నియంత్రించుకోవచ్చు.
❃ అలాగే జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది.
❃ ఇందులో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. కాబట్టి గుండె కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
❃ క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి