ముస్లిమైనా.. క్రిస్మస్ తాత వేషం వేశాడు..!
ఆ చిన్న కుర్రాడితో ఈ సరికొత్త శాంతాక్లాజ్‌కు ఏర్పడిన పరిచయం అనేక సంవత్సరాలు అయినా.. ఇప్పటికీ ఇలాగే కొనసాగుతుందట
లండన్ నగరంలో ఓ ఇంటి అపార్ట్‌మెంట్ ముందు ఆడుకుంటున్న 2 సంవత్సరాల అల్ఫీ అనే కుర్రాడు.. తెల్లటి గెడ్డంతో, భారీ శరీరంతో నడుచుకుంటూ అదే దారిన పోతున్న ఓ ముస్లిం వృద్ధుడిని చూసి శాంతాక్లాజ్‌గా పొరబడ్డాడట. అంతే.. ఇక "శాంతా.. శాంతా" అని అరుచుకుంటూ ఆ వృద్ధుడి వెంట ఏడ్చుకుంటూ పరిగెత్తాడట. పాపం.. తనను చూసి శాంతాక్లాజ్ అని పొరబడ్డాడని భావించిన ఆ ముసలి ముస్లిం ఆ కుర్రాడిని తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టి..వాళ్ల అమ్మకు అప్పగించాడు.
అయితే..ఆ పిల్లాడి ముద్దు ముద్దు మాటలతో పరవశించిన ఆ ముస్లిం షేక్.. ఆ విషయాన్ని మర్చిపోలేక.. ఆ కుర్రాడి కోసం ఏదైనా చేయాలని భావించాడు. అదే రోజు సాయంత్రం తన మత సంప్రదాయలను అన్ని పక్కన పెట్టి.. నిజంగానే శాంతాక్లాజ్ వేషం వేసుకొని ఆ కుర్రాడి ఇంటికి వెళ్లి బోలెడు బహుమతులు ఇచ్చాడట.అలా ఆ చిన్న కుర్రాడితో ఈ సరికొత్త శాంతాక్లాజ్‌కు ఏర్పడిన పరిచయం అనేక సంవత్సరాలు అయినా.. ఇప్పటికీ ఇలాగే కొనసాగుతుందట. ఏ మతమైనా బోధించేది ప్రేమతత్వమే అని చెప్పే ఆ ముస్లిం శాంతాక్లాజ్.. ప్రస్తుతం ఈ కుర్రాడి కుటుంబానికి ఓ ఫ్యామిలి ఫ్రెండ్ అయిపోవడం విశేషం.