Benefits of Black Grapes: నల్ల ద్రాక్ష వలన ఇన్ని లాభాలా.? తెలిస్తే షాకవుతారు!
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ముఖ్యంగా నల్ల ద్రాక్షలని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. గుండె సంబంధిత మరియు డయాబెటిస్ వ్యాధులతో ఉన్న వారు మాత్రం నల్ల ద్రాక్ష తప్పకతినాలి. నల్ల ద్రాక్ష వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి.
Benefits of Black Grapes: శరీరాభివృద్ధికి, ఆరోగ్యంగా ఉండటానికి పండ్లు ఎంతో అవసరం. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వాటిలో నల్ల ద్రాక్ష కూడా ఒకటి. నల్ల ద్రాక్షని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల ద్రాక్ష మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం. నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పండ్లు రక్తంలో చక్కెరను తగ్గించడంలో మరియు అనేక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో నల్ల ద్రాక్ష ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పండ్లు ఎక్కువగా ఫిబ్రవరి నుండి ఏప్రిల్ నెలల మధ్య మార్కెట్‌లలో ఎక్కువగా లభిస్తాయి. నల్ల ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ మరియు క్వెర్సెటిన్ గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలను చేకూర్చే నల్ల ద్రాక్షల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
షుగర్ కంట్రోల్..
నల్ల ద్రాక్ష తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిసందే. దీన్ని తినడం వల్ల షుగర్ కూడా అదుపులో ఉంటుంది. నల్ల ద్రాక్షలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ లు చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మరియు ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది, దీని వల్ల శరీరంలో చక్కెర జీర్ణం అవ్వడం ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా.. చక్కెరని కూడా నియంత్రణలో ఉంచుతుంది. కానీ, నల్ల ద్రాక్షలను ఎక్కువగా తినటం వల్ల రక్తంలో చక్కెరను పెంచుతుంది.
Also Read: Cricket in Olympics: వందేళ్ల తరువాత 2028లో తిరిగి ఒలింపిక్స్‌లో క్రికెట్
కంటి చూపులో మెరుగుదల
డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల కంటి చూపుని మెరుగుపరచడంలో నల్ల ద్రాక్షలు సహాయపడతాయి. ఇటీవల విడుదలైన మీడియా నివేదికల ప్రకారం.. నల్ల ద్రాక్షలో రెటీనా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లుటీన్, జియాక్సంతిన్ అనే కెరోటినాయిడ్లు ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కళ్లను లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. కంటి చూపును కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Also Read: Pravallika Death: ప్రవళ్లిక ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ కామెంట్స్.. కాంగ్రెస్ స్ట్రాంగ్ రిప్లై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..