Dates Benefits For Men: ఖర్జూరాను చాలామంది స్వీట్ లలో వినియోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు పిల్లలకు పాలలో నానబెట్టి స్నాక్స్ లా ఇస్తూ ఉంటారు. అయితే తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని ప్రతిరోజు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి తక్షణ శక్తినిచ్చేందుకు సహాయపడతాయి. అయితే చాలామంది తెలిసి తెలియక వీటిని అతిగా తింటున్నారు. అంతేకాకుండా సమయం సందర్భం లేకుండా తీసుకుంటున్నారు. అయితే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని సరైన సమయంలో తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయట..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఖర్జూరాలు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్  పెంచుకోవాలనుకునేవారు తప్పకుండా వీటిని ఖర్జూరాను పాలలో నానబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది వీటిని ఉదయం పూట ఎక్కువగా తీసుకుంటున్నారు. మార్నింగ్ కి బదులుగా సాయంత్రం 4 గంటల సమయంలో తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా


బరువు పెరగాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట ఖర్జూరాను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను సులభంగా తగ్గించేందుకు సహాయపడతాయని.. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఖర్జూరాలో పొటాషియం, మెగ్నీషియం అధిక మోతాదులో లభిస్తుంది. సిక్స్ ప్యాక్ బాడీ కోసం జింకు వెళ్తున్నవారు ప్రతిరోజు డైట్ లో భాగంగా ఖర్జూరాను తీసుకోవలసి ఉంటుంది. ఇలా ప్రతిరోజు తినడం వల్ల శరీర బరువు పెరిగి బాడీ షేప్ కూడా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ప్రతిరోజు జిమ్ చేసేవారు తప్పకుండా బనానా తో ఖర్జూరాను మిక్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook