Benefits of Eggs: రోజుకు 1-2 కోడిగుడ్లు తినడం వల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలను కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ప్రోటీన్‌ కండరాలను దృఢంగా తయారు చేయడంలో సహాయపడుతాయి. కండరాలను పెంచుకోవాలనుకునే వారు తమ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం మంచిది. బరువు తగ్గడంలో కూడా గుడ్డు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీని వల్ల అతిగా ఆకలి వేయకుండా ఉంటుంది. ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల ఇందులో ఉండే కోలీన్‌ మెదడు ఆరోగ్యంగా ఉండే చేస్తుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మూడ్‌ స్వింగ్స్‌ రాకుండా ఉంటాయి.  గుడ్డులోని హెల్తీ కొవ్వులు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ గురించి చాలామంది ఆందోళన చెందుతారు కానీ, గుడ్డులోని కొలెస్ట్రాల్ మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేయదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఈ గుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ల్యుటిన్, జియాక్సాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు సంబంధిత కంటి సమస్యలను నివారిస్తాయి. ఇందులో విటమిన్ డి ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారువుతాయి. అలాగే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సమస్యలను తగ్గిస్తుంది. గుడ్లు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మంచివి. అయితే ఇది ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికి కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు దీని తీసుకోవడం మంచిది కాదు. 


కొంతమంది గుడ్డు తినప్పుడు అలర్జీ కలుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు గుడ్డును తీసుకోవడం మంచిది కాదు. అలాగే మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు కూడా గుడ్డు తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడేవారు కూడా గుడ్డును తీసుకోవడం మంచిది కాదు. అయితే రోజు రెండు గుడ్డు తినడం కానీ వారు ఒక గుడ్డు అయిని తినవచ్చు. ఏదైనా ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.


గుడ్లు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు:


గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అధికంగా తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా వస్తాయి. గుడ్లు మాత్రమే తీసుకుంటే మన శరీరానికి అవసరమైన ఇతర విటమిన్లు, ఖనిజాలు సరిగ్గా లభించవు. కాబట్టి అతిగా కాకుండా కేవలం మీ శరీరాని బట్టి గుడ్డును తినడం మంచిది. 


Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook