Honey and Gram Flour Mixture: చర్మ సంరక్షణ కోసమా మనలో చాలా మంది రసాయానిక ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. వీటి వలన చర్మానికి కలిగే లాభాల కన్నా.. నష్టాలే ఎక్కువ. ఇంట్లో ఉండే శనగపిండి మరియు తేనె మిశ్రమం ఎంతగానో దోహాద పడుతుంది. ఈ మిశ్రమం వలన ఎన్నో రకాల చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. చర్మానికి వాడే రసాయనిక ఉత్పత్తుల కన్నా ఇది ఎక్కువ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తేనెలో ఎన్నో ఔషధ గుణాలతో పాటు.. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే తేనె యాంటీఆక్సిడెంట్ గుణాలతో పాటు  యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. శనగపిండి మరియు పసుపు కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శనగపిండి - తేనె కలిపి రోజు ముఖానికి వాడటం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇపుడు తెలుసుకుందాం. 


శనగపిండి - తేనె మిశ్రమాన్ని ముఖం పై రాసుకోవడం వల్ల కలిగే లాభాలు:  
ముఖ చర్మం బిగుతుగా మారుస్తుంది.. 

ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేయడం ద్వారా.. ముఖంపై చర్మం బిగుతుగా తయారవుతుంది. దీని కారణంగా ముడతలు మరియు చిన్న చిన్న లైన్స్ తక్కువ అవుతాయి. శనగపిండి, తేనె కలిపి రాసుకోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలు తగ్గించి.. యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. 


మొటిమలు, మచ్చలు దూరం.. 
శనగపిండి, తేనె కలిపి ముఖానికి పట్టించడం వల్ల ముఖంపై పేరుకున్న జిడ్డు, మురికి తొలగించబడతాయి. ఇది చర్మ రంధ్రాలను కూడా లోతుగా శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయో. దీనితో పాటు ముఖ: ఛాయను మెరుగుపరచడంలో కూడా సహాయపడతుంది. 


Also Read: శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? ఈ డ్రింక్స్ తాగండి.. కొన్ని రోజుల్లోనే ఫలితం పొందుతారు!


టానింగ్ & పిగ్మెంటేషన్ తొలగిస్తుంది..  
శనగపిండి మరియు తేనె మిశ్రమం.. ముఖంలోని నలుపుదనాన్ని, డార్క్ ప్యాచ్‌లు, టానింగ్ మరియు పిగ్మెంటేషన్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఈ మిశ్రమం ముఖ ఛాయను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా.. చర్మం యొక్క అసమాన రంగును సరిచేయడంలో తోడ్పడుతుంది.. శనగపిండి - తేనె మిశ్రమం చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. 


మృదువైన చర్మం.. 
శనగపిండి మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. తేనె -  శనగపిండి రెండూ చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. ఇది చర్మంలోని తేమను చర్మ కణాలలో లాక్ చేయటమే కాకుండా.. పొడి చర్మం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకూండా ఈ మిశ్రమం చర్మాన్ని మృదువుగా కూడా చేయటంలో సహాయపడుతుంది. 


Also Read: Protein Poisoning: మితిమీరిన మోతాదులో ప్రోటీన్ తీసుకుంటే..మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకున్నట్టు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook