Benefits Of Onion Juice: చలికాలంలో వాతావరణం లోని తేమ పెరగడం వల్ల సులభంగా జుట్టు సమస్యలు, చర్మ సమస్యలు వస్తాయి. అయితే చాలామందిలో శీతాకాలంలో జుట్టులో చుండ్రు పెరిగి వెంట్రుకలు రాలటం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఉల్లిపాయను జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఉల్లిపాయలు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఉల్లిపాయ రసాయన జుట్టుకు అప్లై చేయడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉల్లిపాయ రసం ఎలా ఉపయోగించాలో తెలుసా..?
శీతాకాలంలో వచ్చే చుండ్రు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఉల్లిపాయ రసంలో తేనెను కలిపి జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా జుట్టుకు అప్లై చేసిన తర్వాత 20 నిమిషాల పాటు ఆరనిచ్చి మంచినీటితో తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చలికాలంలో వచ్చే చుండ్రు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


నిమ్మ, ఉల్లిపాయ ఉపయోగించండి:


వింటర్ సీజన్‌లో జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే జుట్టు రాలడం, జుట్టులో చుండ్రు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఉల్లిపాయ రసంలో రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడమే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.


గుడ్లతో జుట్టు సమస్యలకు చెక్:
గుడ్లను శరీరరావుగా నిరోధక శక్తి పెంచుకోవడానికి కాకుండా జుట్టు సమస్యలకు కూడా ఉపయోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రోటీన్లు జుట్టును దృఢంగా చేయడమే కాకుండా జుట్టు సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు తప్పకుండా గుడ్లను జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది.


Also Read : Mahesh Babu Wife : నాలో వేడి పుట్టించండంటోన్న మహేష్‌ బాబు భార్య.. కొత్త లుక్కుతో షాకిచ్చిన నమ్రత


Also Read : Jabardasth Anchor Sowmya : కనిపించని హైపర్ ఆది.. పెరిగిపోతోన్న జబర్దస్త్ యాంకర్ సౌమ్య క్రేజ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook