Saloon Like Glossy Hair: సెలూన్ వంటి గ్లాసీ హెయిర్ లుక్ ఇంట్లోనే పొందడానికి 5 టిప్స్..
Home Remedies For Saloon Like Glossy Hair: మన జుట్టుకు ప్రతిరోజు లేకుంటే వారంలో మూడు సార్లు అయినా హెయిర్ ఆయిల్ ఉపయోగించాలి. కొబ్బరి నూనె లేదా ఆర్గాన్ ఆయిల్స్ మన జుట్టుకు లోతైన పోషణను అందిస్తాయి. దీంతో మీ చుట్టూ ఆరోగ్యంగా మెరుస్తూ మృదువుగా కనపడుతుంది
Home Remedies For Saloon Like Glossy Hair: హెయిర్ పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇక ఏవైనా పార్టీలు, పెళ్లిళ్లు ఉంటే వెంటనే సెలూన్లకు క్యూ కడతారు. జుట్టును అందంగా కనిపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తారు. అయితే, కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే, అప్పటికప్పుడు హెయిర్ మెరిపిచడం కాకుండా రెగ్యులర్ గా చర్యలు తీసుకోవడం వల్ల సహజసిద్ధంగా ఎప్పటికీ మెరుస్తుంది. దీనికోసం చాలా మంది పార్లర్‌కు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేస్తారు. అయితే ఇంట్లోనే సెలూన్ లాంటి గ్లాసీ హెయిర్ పొందడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. దీంతో సహజ సిద్ధంగా జుట్టు మెరుస్తూ కనిపిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
ఆయిల్..
మన జుట్టుకు ప్రతిరోజు లేకుంటే వారంలో మూడు సార్లు అయినా హెయిర్ ఆయిల్ ఉపయోగించాలి. కొబ్బరి నూనె లేదా ఆర్గాన్ ఆయిల్స్ మన జుట్టుకు లోతైన పోషణను అందిస్తాయి. దీంతో మీ చుట్టూ ఆరోగ్యంగా మెరుస్తూ మృదువుగా కనపడుతుంది
కోల్డ్ వాటర్..
హెయిర్ వాష్ చేసేటప్పుడు చాలా మంది వేడి నీళ్లతో తలస్నానం చేస్తారు. అతిగా వేడి నీళ్లు ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారి పోతుంది. అయితే చల్ల నీటితో హెయిర్ వాష్ చేయడం వల్ల జుట్టు మెరుస్తుంది. హెయిర్ డ్యామేజ్ సమస్య సమస్య తగ్గుతుంది. ఆరోగ్యంగా మెరుస్తుంది.
ఇదీ చదవండి: విటమిన్ బి 12 లోపం ఉందా? ఈ పవర్ ఫుల్ డ్రింక్ దాన్ని భర్తీ చేస్తుంది..
యాపిల్ సైడర్ వెనిగర్..
యాపిల్ సైడర్ వెనిగర్ పిహెచ్ లెవెల్స్ ని సమతుల్యం చేస్తుంది ఇది జుట్టుకు నేచురల్ గా షైన్ అందిస్తుంది సులభంగా అందుబాటులో ఉంటుంది.
హీటింగ్..
జుట్టును నాచురల్ పద్ధతిలో మాత్రమే ఆరబెట్టుకోవాలి. స్ట్రెయిటెనింగ్ చేసుకోవాలి. ఎలాంటి హీటింగ్ టూల్స్ వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి హీటింగ్ టూల్స్ జుట్టుని డ్యామేజ్ చేస్తాయి. జుట్టును ఎప్పటికప్పుడు వాష్ చేసిన తర్వాత నాచురల్ గా మాయిశ్చర్ కూడా అందేలా చూడాలి దీంతో ఆరోగ్యంగా జుట్టు మెరుస్తుంది.
ఇదీ చదవండి: కడుపులో గ్యాస్ ఇబ్బంది పెడుతోందా? బామ్మల కాలం నాటి అద్భుత చిట్కా..
పిల్లో కేస్..
అంతే కాదు మనం పడుకునేటప్పుడు ఉపయోగించే పిల్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. సాటిన్ లేదా సిల్క్ పిల్లో కేసులను ఉపయోగించడం వల్ల హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. జుట్టు మెరుస్తూ కనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంట్లోనే జుట్టు సెలూన్ లాగా గ్లాసీ లుక్ అందుతుంది ఏదైనా జుట్టు సమస్యలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.