తేనె అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఓ దివ్యౌషధం. మృదువైన చర్మం, అందమైన కేశాలు పొందాలంటే తేనె అద్భుతంగా ఉపయోగపడుతుంది. కేశాలు మెత్తగా, చర్మం గులాబీలా మృదువుగా మారుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చర్మం నిగారింపు, మృదువైన కేశాలు, అందం కావాలని అందరికీ ఉంటుంది. అయితే చలికాలంలో ఈ మీ అందంపై దుష్ప్రభావం పడుతుంటుంది. చలికాలంలో డ్రైనెస్, డాండ్రఫ్ సమస్య వెంటాడుతుంటుంది. డాండ్రఫ్ కారణంగా జుట్టు వేగంగా రాలిపోతుంటుంది. చలికాలంలో చర్మం కూడా దెబ్బతింటుంది. ముఖం నిర్జీవంగా మారిపోతుంటుంది. చర్మంపై నిగారింపు పోతుంది. ఈ అన్ని సమస్యలకు తేనెతో ఉపశమనం పొందవచ్చు.


తేనెతో హెయిర్ మాస్క్


తేనెను సాధారణంగా చాలా రకాల వస్తువుల్లో కలుపుతుంటారు. తేనెను ఆయుర్వేద మందులా ఉపయోగిస్తారు. మీ కేశాలకు నిగారింపు తీసుకొచ్చేందుకు తేనె అద్భుతంగా ఉపయోగపడుతుంది. కేవలం 2 స్పూన్ల తేనెలో 2 స్పూన్ల వెనిగర్ కలపాలి. తరువాత ఇందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ దాదాపు ఓ అరగంట రాసి ఉంచాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి. మీ కేశాలు మృదువుగా, అందంగా మారతాయి.


తేనెతో ఫేస్ మాస్క్


కేశాలకున్నట్టే తేనెతో చర్మానికి కూడా చాలా ప్రయోజనం కలుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సహా చాలా రకాల న్యూట్రియంట్లు ఉంటాయి. తేనెలో విటమిన్ ఇ ఆయిల్ మిక్స్ చేసి..పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. దీనివల్ల చర్మం డ్రైనెస్, పింపుల్స్, డెడ్ స్కిన్ తొలగిపోతాయి. చర్మం మృదువుగా మారుతుంది. 


Also read: Health Tips: ఆ రెండు కలిపిన నీళ్లు తాగితే చాలు..మలబద్ధకం, అజీర్తి, స్థూలకాయం అన్ని సమస్యలు మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook