Skin care: మీ ముఖంపై మొటిమలతో బాధపడుతున్నారా? త్వరలో ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్ కు వెళ్లాలా? కంగారుపడకండి.. వాటిని సులభంగా తగ్గించుకునే బెస్ట్‌ హోం రెమిడీస్ ఉన్నాయి. వాటిని మీరూ ఓసారి ట్రై చేయండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖంపై యాక్నే మచ్చలు తగ్గడానికి 5 ఎఫెక్టివ్ హోం రెమిడీస్ ఉన్నాయి.  సాధారణంగా కొంతమందికి మచ్చలు త్వరగా తగ్గుతాయి. మరికొందరికి అంత త్వరగా తగ్గవు ఇది చర్మ తత్వాన్ని బట్టి మారుతుంది. వాటికి ఇలా చెక్ పెట్టండి.


ఐస్ థెరపీ..
మచ్చలు దానివల్ల ఏర్పడిన వాపు వంటివి ఐస్ క్యూబ్స్ తో త్వరగా తగ్గుతాయి. మీరు ఏదైనా పార్టీలకు వెళ్లాల్సి ఉంటే దానికి ముందురోజు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో ఐస్ క్యూబ్స్ వేసి మచ్చలు ఉన్న ప్రాంతంలో సున్నితంగా మసాజ్ చేయండి. మీకు వీలైనంతసేపు మర్దనా చేసుకోండి.


టీ ట్రీ ఆయిల్..
టీ ట్రీ ఆయిలో ఉండే యాంటీబ్యాక్టిరియ్ లక్షణాల కారణంగా మచ్చలు త్వరగా తగ్గిపోతాయి. మచ్చలకు కారణమయ్యే బ్యాక్టిరియాతో పోరాడుతుంది. కాటన్ పై కొన్నిచుక్కల టీ ట్రీ ఆయిల్, జోజోబా ఆయిల్ ను మిక్స్ చేసి మచ్చలపై రుద్దండి. టీట్రీ ఆయిల్ ను ముఖంగా నేరుగా అప్లై చేయకూడదని గుర్తుంచుకోండి. 


యాపిల్ సైడర్ వెనిగర్ టోనర్..
వెనిగర్, నీళ్లు 1:3 నిష్పత్తిలో తీసుకుని యాపిల్ సైడర్ వెనిగర్ టోనర్ ను తయారు చేసుకోండి. ముఖం క్లెన్సింగ్ చేసుకన్న తర్వాత కాటన్ బాల్ సహాయంతో టోనర్ ను అప్లై చేయండి. యాపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. పీహెచ్ లెవల్ ను నిర్వహిస్తుంది.


Also read: Sugar Spike Foods: ఈ 5 డయాబెటిక్ రోగులకు విషం.. తిన్నవెంటనే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయట.. !


పసుపు..
పసుపులో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. పసుపును తేనె లేదా నీళ్లతో పేస్ట్ తయారుచేయాలి. మచ్చల ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖం కడగాలి.


కలబంద..
కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  దీనివల్ల ముఖంపై రెడ్ నెస్ తగ్గిపోతుంది. కలబంద జెల్ ను మచ్చల ప్రభావిత ప్రాంతంలో నేరుగా అప్లై చేయండి. కాసేపయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 


Also read: Breakfast Ideas: ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను ఉదయాన్నే త్వరగా సిద్ధం చేసుకోవచ్చు.. తప్పకుండా ప్రయత్నించండి..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter