Skin Care Tips: 30 ఏళ్లకే చర్మం కాంతి విహీనమౌతుందా..ఇలా చేయండి
Skin Care Tips: ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ కూడా చాలా అవసరం. 30 ఏళ్లు దాటిన తరువాత చర్మంలో నిగారింపు తగ్గడం సహజమే. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే నిత్య యవ్వనంగా కన్పించడం ఖాయం
కేవలం ఆహార పదార్ధాలే కాదు..చుట్టూ ఉన్న వాతావరణం, జీవనశైలి, పని ఒత్తిడి ఇవన్నీ ఆరోగ్యంపై, చర్మంపై ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా చర్మం కాంతి కోల్పోతుంటుంది. ఓ వయస్సు దాటాక అంటే 30 ఏళ్లు దాటాక ఈ సమస్య సహజంగా తలెత్తుతుంటుంది.
అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న వయస్సుకే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. ముఖం, చర్మం కాంతి విహీనమౌతుంటాయి. అయితే చర్మం కాంతి కోల్పోకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాల్సి ఉంటుంది. చర్మానికి సరైన కేర్ తీసుకోవపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఫలితంగా అందం కూడా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన చర్మం, ముఖంలో గ్లో కోసం ఏ టిప్స్ పాటించాలో చూద్దాం..
మాయిశ్చరైజర్
30 ఏళ్ల వయస్సు దాటిన తరువాత చర్మానికి మాయిశ్చరైజర్ తప్పకుండా రాయాల్సి ఉంటుంది. మాయిశ్చరైజర్ వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు లభించి..చర్మం కాంతివంతంగా మారుతుంది. మీ చర్మాన్ని బట్టి ఏ మాయిశ్చరైజర్ వాడాలనేది నిర్ణయించుకోండి. మాయిశ్చరైజర్ వినియోగం వల్ల చర్మంలో తేమ కొనసాగుతుంది. చర్మంపై ముడతల సమస్య పోతుంది.
టోనర్
స్కిన్ టోనర్ అనేది తప్పకుండా వాడాలి. టోనర్ వాడటం వల్ల చర్మంలోపలున్న వ్యర్ధాలు శుభ్రమౌతాయి. చర్మం పీహెచ్ స్థాయి కూడా బ్యాలెన్స్ అవుతుంది. టోనల్ వాడటం వల్ల చర్మం డ్రైనెస్ సమస్య పోతుంది. టోనర్ క్రమం తప్పకుండా వాడుతుంటే చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది.
సీరమ్
సీరమ్ అప్లే చేయడం వల్ల చర్మ కణాలు యాక్టివ్ అవుతాయి. సీరమ్ రాత్రిపూట రాస్తుంటే..చర్మ సంబంధిత సమస్యలు చాలావరకూ దూరమౌతాయి. సీరమ్ అనేది చర్మానికి కావల్సిన పోషకాలను అందిస్తుంది.
సన్‌స్క్రీన్ లోషన్
ఫేస్ కేర్ కోసం సన్‌స్క్రీన్ తప్పకుండా వాడాలి. బయటకు వెళ్లేముందు సన్‌స్క్రీన్ లోషన్ రాసి..ఇంటికొచ్చిన తరువాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.
Also read: Diet In Asthma: ఆస్తమాతో బాధపడేవారు ఇలా చేస్తే కేవలం 10 రోజుల్లో తగ్గుతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook