Bhogi Festival 2023: సంక్రాంతి పండుగను ఊరు వాడా ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. గ్రామాల్లో 10 రోజుల ముందు నుంచే సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఎక్కడెక్కడో నివసిస్తున్న వారు సంక్రాంతిని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి మూడు రోజులపాటు సంక్రాంతి సంబురాలు జరుగుతాయి. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ పర్వదినాలను జరుపుకుంటారు. పది రోజుల ముందు నుంచే ఇళ్లను రంగులు, సున్నాలతో ముస్తాబు చేసుకుంటారు. కూతుళ్లను, అల్లుళ్లను పండుగలకు పిలిచి పిండి వంటకాలను వడ్డించి పెడతారు. ఈ పండుగను ఒక్కోరోజు ఒక ప్రత్యేకతతో వేడుకలు నిర్వహిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భోగి పండుగ ఎందుకంటే..?


మకర సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. ఈ రోజు తెల్లవారు జామునే లేచి భోగి మంటలు వేస్తారు. ఇంట్లోని పిల్లలు, పెద్దలు అందరూ కలిసి భోగి మంటల వద్ద చలి కాచుకుంటారు. ఇంట్లో ఉండే పాత వస్తువులు, చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన కట్టెలు, ఇతర వస్తువులు తీసుకువచ్చి భోగి మంటల్లో వేస్తారు. కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు చిహ్నంగా కూడా ఈ మంటలు వేస్తారు. భూమికి దూరంగా సూర్యుడు దక్షిణం వైపు కొద్ది కొద్దిగా దూరం అవ్వడంతో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు భోగి మంటలు వేయడం ఆచారంగా వస్తోంది.  


భోగి మంటలను కేవలం వెచ్చదనం కోసమే కాకుండా.. ఆరోగ్యం కోసం కూడా అని చెబుతారు.  భోగి పండుగ రోజు ఉదయాన్నే ఆవుపేడతో ఇంటి ముందు  కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల్లో అందమైన గొబ్బెమ్మలను తయారు చేసి అలంకరిస్తారు. సంక్రాంతి పండుగకు స్వాగతం పలుకుతారు. భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు, కర్రలు, ఇంట్లో పాత వస్తువులు వేస్తారు. ఇలా చేయడం వల్ల మనలోని చెడును తగలబెట్టి.. మంచిని పెంచుకునేందుకు సంకేతం అని చెబుతారు. మంటల్లో ఆవు పిడకలు వాడడం వల్ల చలికాలంలో వ్యాపించే అనేక వ్యాధులు వ్యాపించకుండా గాలి శుద్ధి అవుతుంది. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఈ గాలి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


ముఖ్యంగా భోగి పండుగ అంటే పిల్లలదే హవా ఉంటుంది. ఉదయం మంటలు వేసిన దగ్గర నుంచి సాయంత్రం బొమ్మల కొలువు వరకు చాలా ఉత్సాహంగా గడుపుతారు. చిన్న పిల్లలను చక్కగా ముస్తాబు చేసి.. పెద్దలు భోగిపళ్లు పోస్తూ ఆశీర్వదిస్తారు. రేగు చెట్టును బదరీ వృక్షం అని కూడా పిలుస్తారు. రేగు చెట్లు, రేగు పండ్లను శ్రీమన్నారాయణుడి ప్రతి రూపంగా చెబుతారు. ఇది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఫలం. ఈ పండ్లను చిన్న పిల్లల తలపై పోయడం వలన సాక్షాత్తూ శ్రీ లక్ష్మీ నారాయణ అనుగ్రహం పిల్లలపై ఉంటుందని పెద్దలు నమ్ముతారు.  


Also Read: IND Vs Sri Lanka: ఆ ఒక్క షాట్ ఆడకపోయింటే భారత్‌దే గెలుపు.. అక్షర్, సూర్యకుమార్ పోరాటం వృథా  


Also Read: ICC T20 Rankings: 40 స్థానాలను ఎగబాకిన దీపక్‌ హుడా.. టాప్ 10లో ఒక్క ఇండియన్ ప్లేయర్ లేడు!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook