Bitter Gourd Tea For High Cholesterol:  ప్రస్తుతం చాలా మంది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చాలా రకాల రసాయనాలతో కూడిన ఔషధాలు వినియోగిస్తున్నారు. అయితే వీటిని కొలెస్ట్రాల్‌ తగ్గడంతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి సహజంగా కొవ్వును తగ్గించుకోవడానికి పలు రకాల ఇంటి చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం రోజూ వండుకునే కూరగాయలతో కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీని కోసం క్రమం తప్పకుండా కాకరకాయను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు కొవ్వును తగ్గించడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా మధుమేహంతో బాధపడుతున్నవారికి ఇది ప్రభావవంతంగా సహాయపడుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి కాకరను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాకరకాయలో గొప్ప ఔషధాలు దాగి ఉన్నాయి:
కాకరకాయ రసం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీరంలో చెడు పదార్థాలన్నీ బయటకు వస్తాయి. అంతేకాకుండా తీవ్ర వ్యాధులైన మధుమేహం, రక్త పోటు సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కాకర రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కాకరతో కూడా టీని తాయారు చేసుకోవచ్చు. ఈ టీని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


ఇలా కాకర టీ తయారు చేయండి:
కాకర టీ అనేది ఒక హెర్బల్ డ్రింక్, ఎండిన కాకరను తీసుకుని నీటిలో వేసి.. ఆ నీటిని బాగా మరిగించాల్సి ఉంటుంది. అందులోనే పుదీనా ఆకులను వేసి బాగా ఉడికించాల్సి ఉంటుంది. ఇలా మరిగించిన నీటిలో తేనె కలుపుకుని
సర్వ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది:
కాకరకాయ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ సులభంగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా సీజనల్‌ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణల, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Rakul Preet Latest: గాగ్రా చోళీలో రకుల్ ప్రీత్ హాట్ ట్రీట్.. సింపుల్ గా కనిపిస్తూనే కవ్విస్తోంది!


Also Read: Ketika Sharma Bold Photos: ప్యాంట్ బటన్లు విప్పేస్తున్న కేతిక శర్మ.. కుర్రకారు తట్టుకోగలరా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook