Black Rice Benefits: చాలా మంది బ్లాక్‌ రైస్‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వినే ఉంటారు. ఎందుకంటే ఈ రైస్‌ అన్నింటికన్న భిన్నంగా ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ రైస్‌ ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ బ్లాక్‌ రైస్‌లో ఉండే పోషకాలు జీర్ణ క్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ రైస్‌ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తుంది. అయితే ఈ బ్లాక్‌ రైస్‌ను క్రమం తప్పకుండా తినడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్లాక్ రైస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
కంటి చూపును మెరుపర్చుతుంది:

బ్లాక్ రైస్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.


అనేక రకాల పోషకాలు లభిస్తాయి:
బ్లాక్ రైస్‌లో ఫైబర్, ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంగా తినడం వల్ల శరీరం దృఢంగా మారి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది.


గుండెపోటు ప్రమాదాన్ని తగ్గుతుంది:
బ్లాక్ రైస్ తినడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. ఇందులో శరీరానికి కావాల్సిన ఫ్లేవనాయిడ్స్ అనే మూలకం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకుంటే గుండె జబ్బులను నయం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలిని అసుసరించడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ రైస్‌ను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.


క్యాన్సర్ నుంచి రక్షణ:
బ్లాక్ రైస్‌లో ఆంథోసైనిన్ పరిమాణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో క్యాన్సర్ నుంచి శరీరాన్ని రక్షణ కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వంటి యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి సులభంగా అనారోగ్య సమస్యల నుంచి శరీరానికి రక్షణ కలిగిస్తాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: IND vs BAN: 25 ఏళ్ల తర్వాత.. రాహుల్ ద్రవిడ్‌కు అలన్ డొనాల్డ్ క్షమాపణలు! డిన్నర్‌కి కూడా పిలిచాడు 


 


Also Read: Sun Transit 2022: నేడే త్రిగ్రాహి యోగం.. ఈ 5 రాశుల వారు అదృష్టవంతులు! లెక్కలేనంత డబ్బు మీ సొంతం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.