Black Spots on Face: ప్రస్తుతం చాలా మంది ముఖంపై మచ్చలు,  మొటిమల వంటి సమస్యలతో బాధపడతూ ఉంటారు. ముఖంపై నల్ల మచ్చలు ఉండడం వల్ల ముఖంగా అందహీనంగా తయారవుతుంది. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను వినియోగిస్తురు. కానీ ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నారు. అయితే వీటి నుంచి ఉపశమనం పొందడానికి సహజంగా లభించే గేదె పాలు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పాలతో ముఖం యొక్క డెడ్ స్కిన్ పొర పూర్తిగా తొలగిపోయి.. ముఖంపై కనిపించే మచ్చలు కూడా తగ్గిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే పాల వల్ల ఈ మరకాలు ఎలా తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. పాలు, చందనం:


కవాల్సిన పదార్థాలు:


- ఒక చెంచా చందనం
- ఒక చెంచా పాలు
-  ఒక చెంచా పాల పొడి


దీనిని ఎలా తయారు చేయాలి:


ప్యాక్ చేయడానికి ఒక గిన్నెలో చందనం, పాలు, పాలపొడిని బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరకను స్క్రబ్ చేస్తూ నిదానంగా అప్లై చేసి.. ముఖంపై 10 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.


2. పాలు, బియ్యం పిండి, విటమిన్ ఇ క్యాప్సూల్:


పదార్థం:


- ఒక చెంచా పాలు
- ఒక చెంచా బియ్యం పిండి
-  ఒక విటమిన్-ఇ క్యాప్సూల్


చేసే ప్రక్రియ:


ఈ ప్యాక్ చేయడానికి.. ముందుగా ఒక గిన్నెలో పాలు, బియ్యప్పిండి, విటమిన్-ఇ క్యాప్సూల్స్ కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రం కడగాలి.


3. పాలు, బొప్పాయి:


పదార్థం:


- ఒక చెంచా పాలు
- ఒక చెంచా బొప్పాయి గుజ్జు


దీని కోసం ముందుగా బొప్పాయి గుజ్జును సిద్ధం చేసుకోండి. తర్వాత ఈ గుజ్జులో పాలు కలపి.. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖంపై 20 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా


Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook