Blood Sugar Level: హెల్తీగా ఉంటారని ఈ ఆహారాలు తింటున్నారు, రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం ఖాయం!
Diabetes Patient Should Not Eat Vegetables: మధుమేహం సమస్యలతో బాధపడేవారు పలు రకాల ఆహారాలు ప్రతి రోజు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, బీటా-కెరోటిన్ తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చు.
Diabetes Patient Should Not Eat Vegetables: మధుమేహం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగిపోయి. తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావడమేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం చాలా మంది ఈ కూరగాయలను తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల కూడా మధుమేహం తీవ్ర తరంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కింద పేర్కొన్న కూరగాయలకు మధుమేహంతో బాధపడుతున్నవారు తీసుకోకపోవడం మంచిదంటున్నారు.
మధుమేహంతో బాధపడేవారు ఈ కూరగాలను తినొద్దు:
బంగాళాదుంప:
బంగాళాదుంపను ప్రతి రోజు తినడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా దీనిని వివిధ రకాల ఆహారాలు తయారు చేయడానికి వినియోగిస్తారు. ఇందులో స్టార్చ్, కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు వీటిని తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ ఉంది.
మొక్కజొన్న:
మొక్కజొన్న ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కానీ వీటిని మధుమేహంతో బాధపడుతున్నవారు తినడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్స్ అధికంగా లభిస్తాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
పచ్చి బఠానీలు:
మధుమేహంతో బాధపడుతున్నవారికి పచ్చి బఠానీలు కూడా హానికరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చిలగడదుంప:
చిలగడదుంపలో కూడా కార్బోహైడ్రేట్లు, బీటా-కెరోటిన్ సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల ఈ దుంపను తినడం వల్ల తీవ్ర మధుమేహం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల కూడా రావొచ్చు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook