Body Oil Massage For Blood Pressure: ప్రస్తుతం చాలా మంది తరచుగా శరీర నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా కొందరిలో జీర్ణక్రియ సమస్యలతో పాటు ఒత్తిడి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అతిగా కూర్చుని వర్క్‌ చేయడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఖరీదైన వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వైద్యానికి బదులుగా నాటు వైద్య చిట్కాలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. నిపుణులు సూచించిన విధంగా శరీరానికి ఆయిల్ మసాజ్ చేయడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. నెలలో 4 నుంచి 5 సార్లు నూనెతో బాడీకి మసాజ్‌ చేయడం వల్ల అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. బాడీ మసాజ్ వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయిల్ మసాజ్ వల్ల కలిగే లాభాలు:
కండరాలు రిలాక్స్ కోసం మసాజ్‌:

క్రమం తప్పకుండా నూనెతో బాడీకి మసాజ్‌ చేయడం వల్ల కార్టిసాల్ స్థాయిలు సులభంగా తగ్గుతాయి. మూడ్ కూడా మరే అవకాశాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బాడీ రిలాక్స్‌ అవ్వడమే కాకుండా మనసు కూడా చాలా వరకు రిలాక్స్‌ అవుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా శరీరానికి ఆయిల్‌ మసాజ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు 


అధిక రక్తపోటు:
చాలా మందిలో అధిక రక్తపోటు పెద్ద సమస్యగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ ఈ సమస్యలు వస్తున్నాయి. అయితే క్రమం తప్పకుండా శరీరానికి ఆయిల్‌ మసాజ్‌ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా రక్త సరఫర కూడా మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా బిపి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాను పాటించండి.


రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
శరీరానికి క్రమం తప్పకుండా ఆయిల్‌ మసాజ్ చేస్తే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా తీవ్ర వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.


Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి