Egg Is Good For Diabetes: డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు ఆహార నియంత్రణ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కళ్ళు, మూత్రపిండాలు, గుండె వంటి ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. అయితే డయాబెటిక్ రోగులకు గుడ్లు మంచిదా అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. గుడ్లు అనేక పోషకాలకు మంచి మూలం. వీటిలో కోలిన్, లుటిన్ వంటివి మెదడు ఆరోగ్యానికి వ్యాధుల నివారణకు సహాయపడతాయి. అంతేకాకుండా గుడ్డు పచ్చసొనలో చర్మం, జుట్టు, గోర్లకు మేలు చేసే బయోటిన్,  ఇన్సులిన్ ఉత్పత్తికి అవసరమైన పోషకాలు ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునుపటిలో గుడ్లలో అధిక కొలెస్ట్రాల్ ఉండటం వల్ల డయాబెటిక్ రోగులకు మంచివి కాదని భావించేవారు. కానీ వాస్తవానికి గుడ్లలో మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచదు. అంతేకాకుండా డయాబెటిక్ రోగులకు మేలు చేసే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా గుడ్లలో పుష్కలంగా లభిస్తుంది. అధ్యయనాల ప్రకారం, డయాబెటిక్ రోగులు పరిమిత పరిమాణంలో గుడ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.


డయాబెటిస్‌ ప్రభావితం చేస్తుంది: 


డయాబెటిస్‌ ఉన్నవారు వారినికి ఏడు రోజుల పాటు తినవచ్చు. గుడ్డు సొనను తొలగించడం వల్ల కొవ్వు తగ్గుతుంది. ఆరోగ్యకరమైన వంట పద్ధతులను ఉపయోగిచాలి. దీంతో పాటు గుడ్డులో కూరగాయలు లేదా లీన్‌ ప్రోటీన్‌ పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది  


మీకు డయాబెటిస్ ఉంటే మీ ఆహారంలో గుడ్లు మీ డైట్‌ చేర్చుకోవచ్చు. డయాబెటిస్ నియంత్రణకు  మొత్తం ఆరోగ్యానికి సహాయపడే అనేక ప్రయోజనాలను ఇవి అందిస్తాయి. అయితే మీ వ్యక్తిగత ఆహార ప్రణాళిక గురించి మీ వైద్యుడితో మాట్లాడటం ముఖ్యం, ఎందుకంటే మీకు ఏది సరైనదో వారు నిర్ణయించడంలో మీకు సహాయపడతారు.


గుడ్లు తినేటప్పుడు ఈ క్రింది చిట్కాలను కూడా గుర్తుంచుకోండి:


తాజా గుడ్లను మాత్రమే తినండి.


గుడ్డు సొనను పూర్తిగా ఉడికించండి.


గుడ్డుతో పాటు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఇతర పోషకమైన ఆహారాలను తినండి.


రోజంతా చిన్న, సమతుల్య ఆహారాలను తినండి.


క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.


గుడ్డు ఉడకబెట్టి తీసుకోండి.


ఈ విధంగా మీరు గుడ్లును తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా మీరు ప్రతిరోజు పైన చెప్పిన విధంగా ఆహారంలో గుడ్లను చేరుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే మీకు ఎలాంటి ప్రశ్నలు ఉంటే మీ వైద్యుడిని సంప్రదించి వారి సూచనలు తీసుకోవడం మరింత మంచిది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి