Cardamom Belly Fat Burning Tips: యాలకులను ఎన్నో ఏళ్లుగా మనం వంటల్లో వినియోగిస్తాం. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. యాలకులు వంటల్లో రుచిని పెంచి మంచి అరోమాను ఇస్తాయి. ఈ మసాలాతో టీ కూడా తయారు చేసుకుంటారు. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు కూడా ఉంటాయి. దీంతో బరువు కూడా సులభంగా తగ్గిపోతారు. యాలకులు డైట్లో చేర్చుకుంటే ఏ ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెటబాలిజం..
యాలకులు థర్మోజెనిక్ మసాలా. మన డైట్లో చేర్చుకోవడం వల్ల బాడీ మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇవి మన శరీరంలో అదనపు కేలరీలను తగ్గిస్తుంది. యాలకులను నేరుగా కూడా నమిలేయవచ్చు. 


అధికనీరు..
యాలకులు మన శరీర పనితీరుకు కూడా ఎంతో సహకరిస్తాయి. ముఖ్యంగా మన శరీరంలో అధికంగా ఉండే నీటిని బయటకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. యాలకులు సహజసిద్ధమైన డైరేటిక్ మాదిరి పనిచేస్తుంది. దీంతో అదనపు బరువు కూడా తగ్గిపోతారు.


మెరుగైన జీర్ణక్రియ..
యాలకులు మన డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. జీర్ణరసాలు, ఎంజైమ్‌లు ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఫుడ్ బాగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఖనిజాలను కూడా సులభంగా గ్రహించేలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.


ఆకలి ఉండదు..
యాలకులు తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు ఆకలి వేయదు. దీంతో అతిగా తినాలని అనిపించదు. ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. అనారోగ్య కరమైన ఆహారాలు తినాలని అనిపించదు. వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు యాలకులను డైట్లో చేర్చుకోండి.


ఇదీ చదవండి: ఓపెన్‌ పోర్స్‌ ఎక్కువయ్యాయా? ఇంట్లో తయారు చేసిన ఈ ఫేస్‌ఫ్యాక్‌ సూపర్ రెమిడీ..


బాడీ డిటాక్సిఫై..
యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. అంతేకాదు మన శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపించేస్తాయి. యాలకులు మన శరీర పనితీరును మెరుగుపరుస్తాయి.  బరువు కూడా తగ్గిపోతారు.


ఇదీ చదవండి: వెజ్ కుర్మాని సులభంగా ఇలా చేయండి.. చపాతీ-పూరీకి ఇదే బెస్ట్ కాంబినేషన్!


యాలకులను ఇలా తీసుకోండి..
మీరు ఉదయం కాఫీ లేదా టీ తాగేటప్పుడు ఒక చిటికెడు యాలకుల పొడి కూడా వేసి కలపండి. లేదా ఓట్మీల్‌, యోగార్ట్‌ ఏవైనా పండ్లు తీసుకునేటప్పుడు పైనుంచి యాలకుల పొడి చల్లుకోండి. మీరు అన్నం వండుకునేటప్పుడు కూడా యాలకులు గింజలు తీసి వేసుకోవచ్చు.  వీటిని క్వినోవా ఇతర ధాన్యాల్లో కూడా వేసుకోవచ్చు. అంతేకాదు మీరు తాగే నీటిలో యాలకుల పొడి వేసుకోవచ్చు. యాలకుల్లో డైరుటిక్ గుణాలు ఉంటాయి. ఇవి రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. అంతేకాదు ఇవి కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. కేన్సర్‌ తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి