COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cardamom Tea Reduce Constipation And Acidity Problems: ఏలకుల టీ నోటీకి రుచిని అందించడమే కాకుండడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు లవంగాలు, దాల్చినచెక్క, సోపు పొడులతో తయారు చేసిన టీని తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సైతం కూడా దూరమవుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఏలకుల టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఏలకుల టీ ప్రతి రోజు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ ఏలకుల టీని ప్రతి రోజు తాగవచ్చు.


ఈ టీ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. రక్త ప్రసరణ సమస్యలతో బాధపడేవారు కూడా ప్రతి రోజు ఈ టీని తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 


Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్


తరచుగా గుండెపోటు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా  ఏలకుల టీ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు, శరీర నొప్పి మొదలైన సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


గొంతు నొప్పి తగ్గించేందు కూడా ఏలకుల టీ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో అధిక పరిమానంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారు ప్రతి రోజు ఈ టీని తాగాల్సి ఉంటుంది.


ఏలకులతో తయారు చేసిన టీ మౌత్ ఫ్రెషనర్‌గా సహాయపడుతుంది. దంతాల సమస్యలతో బాధపడేవారికి ఈ టీ ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 


Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook