Carrots Benefits: ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే క్యారెట్‌ను వదలకుండా ప్రతిరోజు తింటారు..
Carrots Benefits: క్యారెట్లను ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి గోలేడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా గుండె సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడతాయట. ఇవే కాకుండా మరెన్నో లాభాలు కలుగుతాయి.
Carrots Benefits: భారతీయులు క్యారెట్ల ఎక్కువగా వివిధ రకాల వంటకాల్లో వినియోగిస్తూ ఉంటారు. ఇవి ఆహారాల రుచిని పెంచేందుకు సహాయపడతాయి. అయితే ప్రతిరోజు ఉదయం పూట క్యారెట్ ను తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో పిల్లలకు ప్రతిరోజు ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యారెట్స్ లో అధికం పరిమాణంలో బీటా కెరోటీన్ లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఒక క్యారెట్ తినడం వల్ల శరీరంలోని బీటా కెరోటీన్ పరిమాణాలు పెరిగి విటమిన్ ఏ లాగా తయారవుతాయి. దీని కారణంగా పోషకాలలో నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కంటిచూపు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక క్యారెట్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రేచీకటి వంటి తీవ్రమైన కంటి వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అలాగే చర్మ సమస్యలతో బాధపడే వారికి కూడా క్యారెట్ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు ఫ్రీరాడికల్స్ వంటి సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
తరచుగా రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతిరోజు ఒకటి నుంచి రెండు క్యారెట్లను తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో లభించే విటమిన్ బి6 శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. క్యారెట్లలో లభించే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి మలబద్ధకం వంటి పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతిరోజు క్యారెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
క్యారెట్లలో విటమిన్ కె1, ఫోలేట్, పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి గుండె సమస్యలతో బాధపడే వారు కూడా వీటిని ప్రతిరోజూ తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లను జ్యూస్ లా తయారు చేసుకొని ప్రతిరోజు తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందని వారంటున్నారు. అలాగే క్యారెట్లు ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గించి మానసిక సమస్యలను దూరం చేసేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి. డిహైడ్రేషన్ సమస్యల కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా క్యారెట్ రసంలో తేనే కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి