Health Benefits Of Cashew: డ్రైఫూట్స్‌ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది జీడిపప్పు. దీని ఎక్కువగా స్వీట్‌లో ఉపయోగిస్తారు. ఇందులో ప్రోటీన్‌, విటమిన్‌లు, మినరల్స్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు గుప్పెడు జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే జీడిపప్పు తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీడిపప్పు వల్ల కలిగే లాభాలు: 


జీడిపప్పులో మోనోశాచురేటెడ్‌ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ ను నియంత్రించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ ను పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు గుప్పెడు జీడిపప్పులను తినడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటాము. ఇది ఎముకలను దృఢంగా తయారు చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్‌ ఖనిజాలు శరీరానికి సహాయపడుతాయి. ముఖ్యంగా పిల్లలు పెద్దలు వీటిని ప్రతిరోజు తినడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 


జీడిపప్పులు చర్మాన్నికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా చేస్తాయి. దీని వల్ల ముఖంపై మొటిమలు ,జిడ్డు వంటి సమస్యలు కలగకుండా ఉంటాయి. మెదడు చురుకుగా పని చేయడంలో కూడా జీడిపప్పు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్‌ ఈ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జ్ఞాపకశక్తి పెంచుతుంది. జీడిపప్పులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. జీడిపప్పులో ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచి, అనారోగ్యాల నుంచి కాపాడుతుంది.


జీడిపప్పుని ఎలా ఉపయోగించవచ్చు?


నూనె: జీడిపప్పు నూనెను ఆహారంలో ఉపయోగించవచ్చు. ఇది చర్మం, జుట్టుకు కూడా మంచిది.


పొడి: జీడిపప్పు పొడిని పాయసం, స్వీట్లు తయారీలో ఉపయోగించవచ్చు.


పచ్చిగా: పచ్చి జీడిపప్పును స్నాక్స్‌గా తినవచ్చు.


పాలు: జీడిపప్పు పాలను తయారు చేసి తాగవచ్చు.


జీడిపప్పును తినే మందు మీ వైద్యుడిని సంప్రదించండి అనారోగ్య సమస్యలు ఉన్నారు జీడిపప్పుడు తినడం మంచిది 


ముఖ్యమైన విషయాలు


జీడిపప్పులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అధికంగా తీసుకోవడం మంచిది కాదు.
జీడిపప్పుకు అలర్జీ ఉన్నవారు తీసుకోకూడదు.


సూచన: ఏదైనా ఆహార పదార్థాన్ని అధికంగా తీసుకోవడానికి ముందు మీ వైద్యునిని సంప్రదించడం మంచిది.


Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook