Chaddannam Benefits: రోజు చద్దన్నం తింటే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసా?
Chaddannam Benefits In Telugu: రోజు చద్దన్నం తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఎంతగానో సహాయ పడతాయి. అలాగే మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి.
Chaddannam Benefits In Telugu: మన పూర్వీకులు ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకునేవారు.. అందుకే వీరు ఎంతో బలంగా ఇప్పటికీ ఆరోగ్యవంతంగా ఉన్నారు. అంతేకాకుండా వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు కేవలం చిరుధాన్యాలను మాత్రమే తినేవారు.. వీటితోపాటు అన్నానికి బదులుగా రోటీలు జావాలు తాగేవారు. ఇక వ్యవసాయం చేసే వారైతే ఎక్కువగా చద్దన్నం తినేవారట. ఇది తక్షణమైన శక్తిని అందించడమే కాకుండా రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు అనేక రకాల మూలకాలను శరీరానికి అందించేది. చద్దన్నంలో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు అన్నిటిని తరిమికొడతాయి. ముఖ్యంగా ఎప్పుడు పొట్ట సమస్యలతో కానీ ఇతర సమస్యలతో బాధపడుతున్నారు తప్పకుండా ఆహారంలో చద్దన్నం చేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే రోజు దీనిని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణ సమస్యలకు చెక్:
చద్దన్నంలో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది మన కడుపులోని మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు ఏవైనా సులభంగా తగ్గిపోతాయి.
వెయిట్ లాస్‌కు సహాయపడుతుంది:
చద్దన్నంలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది మనకు ఎక్కువసేపు పొట్ట నిండుగా చేసేందుకు కీలకపాత్ర పోషిస్తుంది. దీంతో సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే స్పీడ్ గా బరువు తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యానికి..:
చద్దన్నంలో పొటాషియం అధిక మోతాదులో లభి స్తుంది కాబట్టి రోజు తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అలాగే ఇందులో ఉండే గుణాలు గుండెను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి గుండె సమస్యలు ఉన్నవారు తప్పకుండా చద్దన్నం తినండి.
ఎముకల ఆరోగ్యానికి..
చద్దన్నం తినడం వల్ల ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఎముకలను ఆరోగ్యవంతంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఎముకల వ్యాధులను తిప్పికొట్టేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
మానసిక ఆరోగ్యం కోసం..:
చద్దన్నంలో అనేక రకాల మూలకాలు ఉంటాయి. ఇవి శరీరంలో అమైనో ఆసిడ్ సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా సహాయపడతాయి. అంతేకాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. తరచుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి తప్పకుండా పెరుగుతో కలిపిన చద్దన్నం తినండి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.