Viral Video: మనలో చాలా మంది ఇతరుల కంటే  భిన్నంగా ఉండాలని ఆలోచిస్తుంటారు. కానీ కొంత మందే ఆలా ఉండగలుగుతారు. కొందరు తమ చేష్టలతో ఎప్పటికప్పుడు ఆశ్చర్య పరుస్తుంటారు. ఎవరీ సాధ్యంకానీ ఫీట్లు చేసి మరీ గుర్తింపు సాధిస్తారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా..తాము చేసే పనుల్లో కిక్ వెతుక్కుంటారు. తాజాగా చెన్నై చెందిన కుర్రాడు చేసిన అలాంటి సాహసమే చేశాడు. అతడేం చేశాడో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా ఎవరైనా ఆటో(Auto)ను మూడు చక్రాలతో నడుపుతారు. కానీ తమిళనాడులోని చెన్నైకు చెందిన ఆటో డ్రైవర్ జగతీష్(Auto driver jagathish) రెండు చక్రాలతో నడిపి రికార్డు సృష్టించాడు. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (guinness record)తన ఇన్‌స్టాగ్రామ్(instagram) పేజీలో పోస్టు చేసింది. ఈ వీడియోనే కాకుండా ప్రపంచ రికార్డులకు సంబంధించి పలు వీడియోలు, చిత్రాలను ప్రజలతో పంచుకుంది. తన ఆటోను రెండు చక్రాలతో 2.2 కిలోమీటర్లు నడిపారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


Also read: Shiva lingam: అమావాస్య నాడు ఆకాశంలో అద్భుతం.. మబ్బులతో దర్శనమిచ్చిన శివ లింగం


గిన్నిస్ రికార్డు
జగతీష్ తన స్టీరింగ్ ఉపయోగించి మూడు చక్రాల వాహనాలను రెండు చక్రాలతో నడిపాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధిస్తానని తను అనుకోలేదని జగతీష్ అన్నారు. చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (జీడబ్ల్యూఆర్) నియమం ప్రకారం కేవలం ఒక కిలోమీటరు దూరం వరకు రెండు చక్రాలపై నడిపితే రికార్డు సృష్టించినట్లే.. కానీ జగతీష్ తన మూడు చక్రాల వాహనాన్ని రెండు చక్రాలపై 2.2 కిలోమీటర్ల దూరం నడిపి రికార్డు సృష్టించాడు.



ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి 316,570 మంది చూశారు. జగతీష్ ప్రతిభను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదీ నిజమేనా.. తమను తాము నమ్మలేకపోతున్నామని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. “సినిమాలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు… భారతీయ సినిమాలు నకిలీవని ఎవరు చెప్పారు?” అని మరొక నెటిజన్ రాసుకొచ్చారు. మరొకరు జగతీష్‎ను”ఇండియన్ ఆటో పైలట్” అని వ్యాఖ్యానించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook