Side Effects Of Chia Seeds In Water: ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు చియా విత్తనాలను అతిగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు శరీర బరువును సులభంగా నియంత్రిస్తాయి. చియా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమన కలిగిస్తాయి. అయితే వీటిని అతిగా వినియోగించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ కింది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని ఏయే వ్యాధులున్నవారు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిక్ పేషెంట్లు చియా సీడ్స్ తినకూడదు:
డయాబెటిక్ పేషెంట్స్‌ పొరపాటున కూడా చియా సీడ్స్ తినకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చియా విత్తనాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీటిని అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు అతిగా చియా సీడ్స్ తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?


రక్తస్రావం సమస్యలున్నవారు తినొద్దు:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో రక్తస్రావం సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రక్రియ దెబ్బతింటుంది.  చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తినడం వల్ల  రక్తస్రావం సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


అజీర్ణం సమస్యలు రావొచ్చు:
చియా గింజల్లో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. చియా విత్తనాలను రోజుకు 4 నుంచి 5 సార్లు తీసుకుంటే..అజీర్ణం, పొట్టలో తిప్పడం వంటి సమస్యలు వస్తాయి. దీని కారణంగా శరీర బరువు కూడా సులభంగా పెరుగుతారు. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అతిగా చియా విత్తనాలను వినియోగించవద్దు.


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి