Cholesterol Control Home Remedies: రోజు లవంగాలను నమిలితే శరీరంలో కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవడం ఖాయం!
Cholesterol Control Home Remedies In Telugu: శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు విపరీతంగా పెరిగిపోవడం కారణంగా కొంతమందిలో గుండెపోటుతో పాటు క్యాన్సర్ కూడా వస్తోంది అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజు ఒకటి నుంచి రెండు లవంగాలను తీసుకోవాల్సి ఉంటుంది.
Cholesterol Control Home Remedies In Telugu: అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం కారణంగా చాలామందిలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది రాత్రిపూట అతిగా ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఆహారాన్ని బాడీ కొవ్వుల మార్చేసి కణాల్లో నిలువ చేస్తోంది. దీని కారణంగా కూడా శరీరంలో కొవ్వు విచ్చలవిడిగా పెరిగిపోతోంది. అయితే బాడీలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 40 సంవత్సరాల వయస్సు మళ్ళిన వారిలో కొవ్వు పెరగడం కారణంగా ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అయితే కొంతమందిలో కొవ్వు ఎక్కువ సంవత్సరాల పాటు నిల్వ ఉండడం కారణంగా తెలుపు రంగులోకి మారిపోతుంది దీంతోపాటు కొలెస్ట్రాల్ పరిమాణాలు కణాల్లో పేరుకుపోయి ఇన్ ప్లామేషన్ తయారవుతుంది. అయితే దీని కారణంగానే శరీరంలో ఫ్రీరాడికల్స్ తయారవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో కొంతమందిలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తున్నాయని వారు అంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజూ తీసుకునే ఆహారాల్లో కొన్ని మసాలా దినుసులను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగినప్పటికీ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఆహారంలో లవంగాలను ఎక్కువగా వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంతేకాకుండా యూజనల్ అనే రసాయన సమ్మేళనాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి అంతేకాకుండా లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.
దీంతోపాటు లవంగాల్లో ఉండే కొన్ని రసాయనాలు కొవ్వు కణాల్లో పేరుకుపోయిన ఇన్‌ప్లామేషన్‌ను తొలగించేందుకు కూడా సహాయపడతాయని ఇటీవలే కొందరు పరిశోధకులు వెల్లడించారు. కాబట్టి శరీరంలోని ఎప్పటి నుంచో అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా లవంగాలను తీసుకోవడం ఎంతో మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిరోజు లవంగాలను ఒకటి లేదా రెండు చొప్పున నోటితో నమిలి తినడం వల్ల దంతాలు కూడా దృఢంగా తయారవుతాయని వారంటున్నారు. దీంతోపాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter