Cholesterol Reduce: మన చెడు ఆహారపు అలవాట్లు కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మాత్రమే కాదు, అనేక రకాల వ్యాధులు మిమ్మిల్ని చుట్టుముడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. లేకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి ఏ పదార్థాలు తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (High Cholesterol) బయటకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెల్లుల్లి (Garlic)


మీ శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది.  దీన్ని తీసుకోవడం వల్ల మీ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కనీసం 10 శాతం తగ్గించవచ్చని చాలా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 


కొత్తిమీర గింజలు (Coriander seeds)


కొంతమంది కొత్తిమీర తింటారు, కానీ అది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని తెలియదు. నిజానికి, ఈ గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ వంటి చాలా ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. మీరు ఒక చెంచా కొత్తిమీర గింజలను నీటిలో సుమారు రెండు నిమిషాలు ఉడకబెట్టి, ఆపై దానిని ఫిల్టర్ చేసి త్రాగవచ్చు. ఇది మీకు చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది.


మెంతి గింజలు (Fenugreek seeds)


మెంతి గింజల వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా అదుపులో ఉంచుకోవచ్చని మీకు తెలుసా? అంటే మెంతికూరను ఆహారంలో చేర్చుకుంటే పక్షవాతం, గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.


Also Read: White Hair Treatment At Home: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి