Cinnamon Water for Weight Loss: ఈరోజుల్లో అధిక బరువు సమస్య అందరినీ వేధిస్తోంది. దీంతో బరువు తగ్గాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. కొందరికి మంచి ఫలితాలను ఇస్తే మరికొందరు ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. అయితే, ఓ కిచెన్‌ వస్తువుతో కూడా బరువు ఎన్ని కేజీలు ఉన్నా సులభంగా తగ్గిపోతారు. అది ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాల్చిన చెక్క మన వంటగదిలో కచ్చితంగా ఉంటుంది నేను బిర్యానిలో ఇతర మసాలా ఆహారాల్లో వేసి వండుకుంటారు దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇది మంచి ఆరోమాను కలిగి ఉంటుంది దాల్చిన చెక్కతో గుండె సమస్యలు బిపి సమస్యలు తగ్గిపోతాయి. ఈ స్టిక్‌ తో తయారు చేసిన నీటితో కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం


మంచి జీర్ణ ఆరోగ్యం..
దాల్చిన చెక్కను మనం ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది కడుపు నొప్పి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. గోరువెచ్చని దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల గ్యాస్ అజీర్తి సమస్యలు కూడా చెక్ పెడుతుంది.


గుండె ఆరోగ్యం..
దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియా యాంటి ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. పరగడుపున దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. మన గుండెను ఆరోగ్యంగా చేస్తుంది.


కండరాలు ఉపశమనం..
పీరియడ్స్‌ సమయంలో ఆడవారు కడుపునొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు మన డైట్ లో దాల్చిని వాటర్ చేర్చుకుంటే కండరాల తిమ్మిరి, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు నొప్పిని తగ్గించి కండరాల ఉపశమనాన్ని కలిగిస్తుంది.


ఇదీ చదవండి: పసుపు మన జుట్టుకు ఒక వరం..ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..


వెయిట్ లాస్
దాల్చిన చెక్కలో బరువు తగ్గించే గుణాలు ఉంటాయి ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా అనిపిస్తుంది దీంతో త్వరగా ఆకలి వేయదు తక్కువగా తింటారు ఇది మెటాలిజం రేటును పెంచుతుంది బరువు కూడా సులభంగా తగ్గిపోతారు.


షుగర్‌ కంట్రోల్..
దాల్చిన చెక్క నేచురల్ ఇన్సూలిన్‌ లా పనిచేస్తుంది అంటే మీరు నమ్ముతారా? అవును దాల్చిన చెక్కనీటిని మీ డైట్లో చేర్చుకుంటే షుగర్‌ ఎప్పుడూ నియంత్రణలోనే ఉంటుంది.


ఇదీ చదవండి: రాగిపిండితో ఈ ఫేస్‌ప్యాక్‌ వేసుకోండి.. మీ ముఖానికి రెట్టింపు కాంతి..


హార్మోన్ బాలన్స్..
దాల్చిన చెక్క నీటిలో సమతుల హార్మోన్లకు శక్తి కలిగి ఉంటుంది మెడికల్ ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి సినిమాలైడ్‌ అనే లక్షణ్ హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ కాలంలో ఈ సమస్యల వల్ల చాలా మంది ఆడవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook