COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

How To Clean Silver At Home: హిందూ సంప్రదాయం ప్రకారం..కాళ్లకి వెండి పట్టిలు ధరించడం ఆనవాయితిగా వస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ వీటిని ధరిస్తారు. అంతేకాకుండా చాలా మంది ప్రస్తుతం వెండి ఆభరణాలు కూడా ధరిస్తున్నారు. అయితే వీటిని తరచుగా ధరించడం వల్ల నల్లగా మారుతున్నాయి. దీని కారణంగా చాలా మంది వాటిని మళ్లీ మళ్లీ ధరించలేకపోతున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే వారికి మేము ఈ రోజు ఇంటి చిట్కాలను తెలపబోతున్నాం. ఈ చిట్కాలను వినియోగించి వెండి ఆభరణాలను శుభ్రం చేయడం వల్ల సులభంగా తిరిగి మెరుపు వస్తుంది. అంతేకాకుండా వాటిపై ఉన్న నల్లని మురికి కూడా సులభంగా తొలగిపోతుంది. అయితే వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


వెండి వస్తువులను ఇలా శుభ్రం చేసుకోండి:
టూత్‌పేస్ట్:

మీ ఇంట్లో ఉండే వెండి వస్తువులు నల్లగా ఉంటే తప్పకుండా ఈ చిట్కా పాటించాల్సిందే..మీరు ప్రతి రోజు వాడే టూత్‌పేస్ట్‌ను ఈ వస్తువులను శుభ్ర చేసుకునేందుకు వినియోగించవచ్చు. అయితే ఈ వస్తువులకు టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి 15 నుంచి 25 నిమిషాల పాటు టూత్ బ్రష్‌తో రుద్ది.. ఆ తర్వాత నీటితో కడగడం వల్ల సులభంగా ఈ వస్తువులు మెరిసిపోతాయి.


 Also Read:  Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్  


బేకింగ్ సోడా:
చాలామంది బేకింగ్ సోడాను వివిధ లోహాలతో కూడిన వస్తువులను శుభ్రం చేసేందుకు వినియోగిస్తారు. అయితే దీనిని వినియోగించి వెండి వస్తువులను కూడా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అయితే దీనిని వినియోగించడానికి ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసుకొని బేకింగ్ సోడాను కలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వెండి కి అప్లై చేసి బాగా రుద్దాలి. ఇలా ఐదు నిమిషాల పాటు రుద్దిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే వెండి ఆభరణాలు మెరుస్తాయి.


నిమ్మకాయ:
చాలామంది నిమ్మకాయను ఇనుప వస్తువులను శుభ్రం చేసేందుకు వినియోగిస్తారు అయితే దీనిని వెండి వస్తువులను శుభ్రం చేసేందుకు కూడా వినియోగించవచ్చు. దీనిని వినియోగించే ముందు ఒక గిన్నెలో బేకింగ్ సోడా తీసుకొని అందులో నిమ్మరసాన్ని మిక్స్ చేసి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని.. వెండి వస్తువులకు అప్లై చేసి శుభ్రం చేస్తే.. మంచి ఫలితాలు పొందుతారు.


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


 Also Read:  Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి