Coconut water for strong hair: మీ జుట్టుకు కొబ్బరి నీళ్లు ఇలా వాడారంటే.. జుట్టు నల్లగా.. మందంగా.. నడుము వరకు పెరుగుతుంది..
Coconut water for strong hair: సాధారణంగా కొబ్బరి నీళ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మన శరీరానికి ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకే ప్రతి రోజు కొబ్బరినీళ్లు తాగాలి అని అంటారు. ఇది మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలు అందిస్తుంది.
Coconut water for strong hair: సాధారణంగా కొబ్బరి నీళ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మన శరీరానికి ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకే ప్రతి రోజు కొబ్బరినీళ్లు తాగాలి అని అంటారు. ఇది మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలు అందిస్తుంది. అంతే కాదు ఇందులో ఎలక్ట్రోలైట్స్, సహజసిద్ధమైన చక్కరలు ఉంటాయి.యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి తగినంత పోషకాలు, మాయిశ్చర్‌ను అందిస్తాయి. మన జుట్టుకు ఉపయోగించడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్యపరంగా ఉపయోగాలు ఉన్నాయి. జుట్టు రాలడం ,దృఢంగా మందంగా పెరగడం మీరే కల్లారా చూస్తారు.
జుట్టుకు హైడ్రేషన్..
కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల మన జుట్టుకు ఇది ఒక వరం. ఇది మన జుట్టుకు మాయిశ్చర్ ఇవ్వడమే కాకుండా కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ మన జుట్టుకు పునరుజ్జీవనం అందిస్తుంది. కొబ్బరినీటిలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం మన జుట్టు కుదుళ్ల నుంచి హైడ్రేషన్ అందిస్తూ మెరిసేలా చేస్తుంది.
కుదుళ్ళు ఆరోగ్యం..
కొబ్బరి నీటిలో మన జుట్టుకు ఆరోగ్యానికి అందిస్తుంది ఇందులో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు హెయిర్ ఫాల్ సమస్యకి మంచి రెమెడీ అంతే కాదు కొబ్బరి నీటిని మన జుట్టుకు అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ సమస్యలకు చెక్ పెడుతుంది. కొబ్బరి నీరు మీ డ్యామేజ్ అయిన జుట్టును రెమిడిగా పనిచేస్తుంది ఇందులో ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల మన జుట్టుకు పునరుజ్జీవనం అందుతుంది.
బలమైన జుట్టు..
జుట్టు కొబ్బరి నీరు జుట్టును బలంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది కుదుళ్ల నుంచి బలంగా ఉంచడంతోపాటు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. కుదళ్లను బలంగా మారుతుంది. కొబ్బరి నీటిలో ఎక్కువ మోతాదులో న్యూట్రియన్స్ ఉండటం వల్ల బ్లడ్ సర్క్యూలేషన్లో మెరుగుపరుస్తుంది. జుట్టు మందంగా కనిపించేలా సహాయపడుతుంది.
ఇదీ చదవండి: రోజూ బాదం పప్పు తింటున్నారా.. అయితే ఈ విషయాలు మీకు తెలుసా?
జుట్టు పెరుగుదల..
కొబ్బరి నీరు జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మందంగా ఉండటంతో పాటు కుదుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కొబ్బరినీటితో జుట్టును కడగటం వల్ల హెయిర్ ఫాలికల్స్ బలపడే జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. కుదుళ్ళ నుంచి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
స్ప్లిట్ ఎండ్స్..
కొబ్బరినూనె తరచుగా జుట్టుకు అప్లై చేయడం వల్ల స్ప్లిట్ అండ్ సమస్య దరిచేరదు ఇది మన జుట్టుకు తగిన పోషకాలు అందిస్తుంది కాబట్టి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
హెయిర్ ఫాల్..
జుట్టుకు కొబ్బరి నీరు అప్లై చేయడం వల్ల జుట్టు రాలే సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే తరచూ కొబ్బరి నీటిని మనం హెయిర్ అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్లు నుంచి ఆరోగ్యంగా ఉంటుంది హెయిర్ ఫాల్ సమస్య ఉండదు.
ఇదీ చదవండి: చర్మాన్ని చమక్కుమనిపించే వేప.. మన స్కిన్‌పై ఎలా పనిచేస్తుందో తెలిస్తే షాక్..!
మెరిసే జుట్టు..
కొబ్బరి నీటిని మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల నాచురల్ లుక్ వస్తుంది నేచురల్ గా మెరుస్తుంది దీంతో సహజంగా మీ జుట్టు పెరుగుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి