Coriander seeds for weight loss: ధనియాలను ఇలా తీసుకుంటే వారంలో ఈజీగా బరువు తగ్గిపోతారు..
Coriander seeds for weight loss: ఈరోజుల్లో కూర్చొని ఎక్కువసమయంపాటు పనులు చేయడం వల్ల బరువు సులభంగా పెరిగిపోతున్నారు. ఇది ప్రధాన సమస్యగా మారిపోతుంది ఇంట్లో ఉండే ఒక వస్తువుతో బరువు ఈజీగా తగ్గవచ్చు.
Coriander seeds for weight loss: ఈరోజుల్లో కూర్చొని ఎక్కువసమయంపాటు పనులు చేయడం వల్ల బరువు సులభంగా పెరిగిపోతున్నారు. ఇది ప్రధాన సమస్యగా మారిపోతుంది ఇంట్లో ఉండే ఒక వస్తువుతో బరువు ఈజీగా తగ్గవచ్చు.ధనియాలను డైట్ లో చేర్చుకుంటే సులభంగా బరువు తగ్గిపోతారు. ఎందుకంటే ధనియాలు న్యూట్రియన్స్ బయో ఆక్టివ్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీర ఆరోగ్యానికి ఎంతో అవశ్యకం బరువు పెరగకుండా కాపాడుతుంది. ధనియాలను డైటో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు ఆకలి ఉండదు అంతేకాదు క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
మెటబాలిజం..
ఆయుర్వేద ప్రకారం ధనియాల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు మెటబాలిజం రేటు పెంచుతాయి ఎంతో శక్తి కూడా పెరుగుతుంది.
ఫైబర్ పుష్కలం..
ధనియాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో ఎక్కువ సమయంపాటు కడును నిండిన అనుభూతి కలుగుతుంది. అతిగా తినకుండా ఉంటారు బరువు తగ్గుతారు.
డీ టాక్సిఫికేషన్..
ధనియాలు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించివేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. ఫ్రీ రాడికల్స్ రాకుండా నివారిస్తుంది. బరువు కూడా సులభంగా తగ్గుతారు.
జీర్ణ క్రియ..
కడుపు సంబంధించిన సమస్యలకు, కడుపు ఉబ్బరానికి ధనియాలు చెక్ పెడతాయి. ధనియాలను తరచుగా డైట్లో చేర్చుకోవడం వల్ల కడుపులో పుండ్లు ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి.
ధనియాల టీ..
ధనియాలతో తయారు చేసిన టీ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి కొలెస్ట్రాల్ కూడా చెక్ పెడుతుంది. రెండు కప్పుల నీటిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి నీటిరంగం మారిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో తేనె వేసుకుని తీసుకోవాలి ఇది పరగడుపునొప్పి తీసుకుంటే ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది.
ఇదీ చదవండి: చీయాసీడ్స్, పసుపునీటిని పరగడుపున తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
ధనియాలు, పుదీనా, నిమ్మకాయ డ్రింక్..
ఈ డ్రింక్ తీసుకుంటే బరువు ఈజీగా తగ్గుతారు. ధనియాలను ఎండిన పుదీనా ఆకులను తీసుకొని పొడి చేసుకోవాలి. గ్లాస్ లో నీటిలో వేసుకొని అందులో నిమ్మరసం పిండుకొని ఉప్పు కూడా వేసుకొని తీసుకోవాలి వర్కౌట్స్ చేసేవారికి బెస్ట్ రెమెడీ.
ఇదీ చదవండి: అవిసెగింజలను మీ డైట్లో చేర్చుకుంటే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు మీ దరిదాపుల్లోకి రావు..
ధనియాల రసం...
ఒక పాన్ లో నెయ్యి ఆవాలు కరివేపాకు, మిరియాలు ధనియాలు వేసి ఉడకబెట్టిన కందిపప్పుని ఎండుమిరపకాయలు ఉప్పు, టమాటా ప్యూరీ వేసుకుని సూప్ మాదిరి తయారు చేసుకోవాలి.రాత్రిపూట ధనియాల నీటిని ఒక టేబుల్ స్పూన్ నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter