Cough Warning Sign: చలికాలంలో కఫం పెరగడం సాధారణం అయినప్పటికీ ఇదే సమస్య వేసవి కాలంలో వస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చలి కాలంలో ఇలాంటి సమస్యలున్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండి కూడా శరీరంలో ఉత్పన్నమయ్యే శ్లేష్మం పెరుగుదలను కూడా గుర్తించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో కఫం పెరగడం వల్ల వచ్చే లక్షణాలు:
>>ఎప్పుడు మత్తులా నిద్రగా ఉండడం.
>>విపరీతమైన దగ్గు
>>ముక్కు నుంచి ధూళి బయటకు రావడం
>>తరచుగా తుమ్ములు రావడం
>>నిద్రలేమి సమస్యలు  
>>అన్ని వేళలా నీరసంగా, అలసట
>>శరీరంలో భారం
>>ఆకలి లేకపోవడం
>>కడుపు ఉబ్బరం
>>అధిక లాలాజలం
>>డిప్రెషన్ కలిగి ఉండటం
>>శ్వాస సంబంధిత సమస్యలు


కఫాన్ని ఎలా నియంత్రించాలి:
తరచుగా కఫం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవన శైలిలో కూడా మార్పుతు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా అనారోగ్య సమస్యలతో పాటు కఫం కూడా నియంత్రణలో ఉంటుంది.


ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
కఫం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బంగాళదుంపలు, బఠానీలు, బీట్‌రూట్, బీన్స్, బ్రోకలీ, క్యాప్సికమ్, క్యాబేజీ వంటివి తినాల్సి ఉంటుంది. అంతేకాకుండా తృణధాన్యాలను కూడా ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.


జీవనశైలిలో మార్పులు తప్పనిసరి:
>>ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
>>ఆవనూనెతో శరీరానికి మసాజ్ చేయాలి.
>>శరీరానికి తగిన పరిమాణంలో సూర్యరశ్మి అందేలా చూడడం.
>>శారీరక శ్రమను పెంచాల్సి ఉంటుంది.


Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్


Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook