Side Effects Or Symptoms After Getting Covid 19 Vaccine: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశంలో రెండో కీలక అడుగు పడింది. జనవరి 16న దేశ వ్యాప్తంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల పంపిణీ ప్రారంభం కాగా, మార్చి 1 నుంచి రెండో దశలో కరోనా వ్యాక్సిన్లు ఇస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేయాలంటే టీకాలు తీసుకోవడంతో సహా భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటివి తప్పనిసరి అయిని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి దశలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకోవాలా వద్దా అనే అనుమానాలు కొందరిలో ఉండేవి. ప్రస్తుతం రెండో దశలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు, తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సహా పలువురు ప్రముఖులు కోవిడ్-19 వ్యాక్సిన్ (COVID-19 Vaccine) తీసుకుని ప్రజలలో కరోనా టీకాలపై నమ్మకాన్ని పెంచారు. అయితే కరోనా టీకాలు తీసుకుంటే ఏ లక్షణాలు కనిపిస్తాయని ఇంకా ప్రజలకు సందేహాలు ఉన్నాయి.


Also Read: Map My India APP: మీకు దగ్గర్లోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఇలా తెలుసుకోండి


భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణా ఎల్లా ఇటీవల మీడియాతో మాట్లాడిన సందర్భంగా పలు లక్షణాలను వివరించారు. కరోనా టీకా(Corona Vaccine) తీసుకున్న వారిలో కొందరికి స్వల్పంగా జ్వరం వస్తుందన్నారు. మరికొందరిలో టీకా తీసుకున్న చోట కాస్త నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయన్నారు. కొందరిలో తలనొప్పి, వికారం, బలహీనంగా ఉన్నట్లు ఒకట్రెండు రోజులు అనిపిస్తుందని డాక్టర్ కృష్ణా ఎల్లా చెప్పారు. అయితే రెండు రోజులు పరిస్థితి అలాగే ఉంటే మాత్రం ఆ వ్యక్తి కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు.


Also Read; Also Read: Corona Vaccination: ఈ వ్యాధులు ఉన్నాయా, అయితే COVID-19 Vaccine తీసుకునేందుకు అర్హులు అవుతారు


కాగా, రెండో దశలో భాగంగా 60 ఏళ్లు పైబడిన ప్రజలు అందరికీ కోవాగ్జిన్, కోవిషీల్డ్ కరోనా టీకాలు ఇస్తున్నారు. 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కోవిడ్19 టీకాలు తీసుకునేందుకు అర్హులు అని కేంద్రం కొన్ని మార్గదర్శకాలు ఇటీవల జారీ చేసింది. 


Also Read: EPFO Interest Rates: 6 కోట్ల మంది EPF ఖాతాదారులకు షాక్, వడ్డీ రేట్లుపై ఎంతమేర కోత విధిస్తారో


టీకా తీసుకునేందుకు అర్హులైన అందరూ కోవిన్ యాప్(Cowin App) ద్వారా టీకా తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాప్ మై ఇండియా యాప్ లేదా వెబ్‌సైట్‌లో మీకు దగ్గర్లో ఉన్న కరోనా టీకా పంపిణీ కేంద్రాల వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. తద్వారా రిజిస్టర్ చేసుకున్న వారు అక్కడికి వెళ్లి కోవిడ్ టీకాలు తీసుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook