Curry Leaves For Hair: కరివేపాకులో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. ఇది చర్మానికే కాకుండా జుట్టుకు కూడా ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే జుట్టు సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్య సమస్యలేనని ఇటివలే నివేదికలు తెలిపాయి. అయితే జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండాఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు నల్లబడుతుంది. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కావున జుట్టుకు కరివేపాకును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జుట్టు నల్లగా మారడానికి ఎలా వినియోగించాలి:
జుట్టు నల్లగా మారడానికి కరివేపాకును ఉపయోగించవచ్చు.  తెల్ల జుట్టు సమస్య శరీరంలో ఫోలికల్‌లో మెలనిన్ లేకపోవడం వల్ల వస్తాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఆహారంలో కరివేపాకు వినియోగిస్తే..అనారోగ్య సమస్యలతో పాటు జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి. ముఖ్యంగా ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బిలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి జుట్టు తెల్లబడకుండా పలు రకాల హార్మోన్స్‌ను విడుదల చేస్తుంది.


జుట్టు నల్లగా మారడానికి కరివేపాకును ఎలా వినియోగించాలి:
జుట్టు నల్లగా మారడానికి కరివేపాకును నూనె, హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. హెయిర్ మాస్క్, కరివేపాకు నూనెను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.


కరివేపాకు నూనె:
కరివేపాకు నూనెను తయారు చేయడానికి.. ముందుగా 1 గిన్నెలో తాజా కరివేపాకు తీసుకోండి. ఆ తరువాత 1 గిన్నె కొబ్బరి నూనె, సగం గిన్నె తరిగిన ఉల్లిపాయలను తీసుకోండి. దీని తర్వాత బాణలిలో నూనె వేడి చేయండి. కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కాసేపు ఉడికించాలి. నూనె రంగు మారిన తర్వాత మంటను ఆపేసి.. ఇప్పుడు ఈ నూనెను చల్లారనివ్వాలి. తర్వాత మీ అవసరాన్ని బట్టి జుట్టుకు అప్లై చేయండి.


కరివేపాకు మాస్క్‌:
కరివేపాకు హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవడానికి.. కరివేపాకును పేస్ట్ చేయండి. అందులో 1 గిన్నె పెరుగు, 2 చెంచాల తేనె కలపండి. ఆ తర్వాత ఈ మాస్క్‌ను మీ జుట్టుకు అప్లై చేసి.. సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook