Curry Leaves Juice Facts: రోజు కరివేపాకు రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
Curry Leaves Juice Facts: కరివేపాకు రసం తాగుతున్నారా? రోజు ఈ రసాన్ని తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? తప్పకుండా ఈ రసం తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Curry Leaves Juice Facts: ఆయుర్వేదంలో కరివేపాకు రసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని సహజసిద్ధమైన ఔషధంగా భావిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్స్‌తో పాటు ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వారంలో ఒక్కరోజైనా కరివేపాకు రసం తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా షుగర్, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ రసం తాగడం చెక్ పెట్టొచ్చు.
కరివేపాకు రసం ప్రయోజనాలు:
జీర్ణ వ్యవస్థకు మేలు:
ప్రతి రోజు కరివేపాకు రసం తాగడం వల్ల సులభంగా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వారంలో ఒక్కరోజైనా ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
షుగర్ లెవెల్స్ నియంత్రణ:
కరివేపాకు రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు డయాబెటిస్‌ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గింపు:
రోజు కరివేపాకు రసం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఇది కూడా చదవండి: Big Billion Days 2024: కళ్లు జిగేల్ అనే డిస్కౌంట్.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.6,000కే iPhone సిరీస్ మొబైల్స్ ప్రారంభం!
మూత్రపిండాల ఆరోగ్యానికి:
కరివేపాకు రసం తాగితే మూత్రపిండాల ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. దీంతో పాటు మూత్రపిండాల్లో రాళ్లు కూడా తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుపడుతుంది.
జుట్టు సమస్యలకు:
జుట్టును ఆరోగ్యంగా ఉంచే రసాల్లో కరివేపాకు రసం కూడా ఒకటి. ఇది జుట్టును ఆరోగ్యంగా చేసేందుకు, చుండ్రు నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Big Billion Days 2024: కళ్లు జిగేల్ అనే డిస్కౌంట్.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.6,000కే iPhone సిరీస్ మొబైల్స్ ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.