ఇద్దరు అమ్మాయిలు.. 2800కి.మీ.ల ప్రయాణం
పూణేకు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఇటీవలే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర ప్రారంభించారు.
పూణేకు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఇటీవలే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర ప్రారంభించారు.కాలుష్యం గురించి అవగాహన పెంపొందించేందుకు, ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'బేటీ బచావో-బేటీ పడావో' (బీబీబీపీ) పథకాన్ని ప్రచారం చేసేందుకు విన్నూత తరహాలో ఈ యాత్రను చేపట్టారు.
ఈ సందర్భంగా యాత్రికుల్లో ఒకరైన పూజా తానాజీ బాధవలే మాట్లాడుతూ "మాకు అద్భుతమైన అనుభవం లభించింది. ఈ మార్గంలో వివిధ గ్రూపులు మాకు సహాయపడ్డాయి. నవంబర్ 27న రైలు ద్వారా మేము జమ్మూకు చేరుకున్నాం. నవంబర్ 30న సైకిల్ యాత్ర ప్రారంభించాం" అని ఏఎన్ఐకు తెలిపారు.
"కాలుష్య ప్రమాదాలపై అవేర్‌నెస్ కలిగించడంతో పాటు , బేటీ బచావో-బేటీ పడావో అనే సందేశాలను వ్యాప్తి చేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం". మా ఈ యాత్రను లేహ్‌లో చనిపోయిన సైకిలిస్ట్ అజయ్ పడ్వాల్‌కు అంకితం చేస్తున్నాము" అని మరో బైకర్ సైలి మిలింద్ మహారావ్ ఏఎన్ఐకి తెలిపారు.