Dandruff Problems Home Remedies In Telugu: ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది చుండ్రు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల షాంపూలతో పాటు నూనెలను అధికంగా వినియోగిస్తున్నారు. దీని కారణంగా మరిన్ని జుట్టు సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ చుండ్రు సమస్య నుంచి రూపాయి ఖర్చు లేకుండా కూడా ఉపశమనం పొందవచ్చు. ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే దీనిని నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ హోం రెమెడీస్ గురించి తెలుసుకోండి:
సోయాబీన్ నూనె:

జుట్టులో చుండ్ర అధికంగా ఉన్నవారు తప్పకుండా సోయాబీన్ నూనెను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చుండ్రు నుంచి ఉపశమనం కలిగించకపోయిన..ఈ సమస్య కారణంగా వచ్చే జుట్టు రాలడం వంటి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు సోయాబీన్ నూనెలో  ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఒమేగా-3 వంటి పోషకాలు జుట్టు దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు ఆదంగా తయారవుతుంది. 


పెరుగు, సోయాబీన్ నూనె రెమెడీ:
ఈ ఆయుర్వేద రెమెడీతో కూడా సులభంగా జుట్టులోని చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పెరుగు, సోయాబీన్ నూనె రెమెడీని తయారు చేసుకోవడానికి ముందుగా 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల సోయాబీన్ ఆయిల్ ఒక గిన్నెలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటిని బాగా కలుపుకుని అందులోనే కొద్దిగా నిమ్మరసం వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇలా తయారు చేసుకున్న రెమెడీ జుట్టుకు అప్లై చేసుకుని 10 నుంచి 15 నిమిషాలు పాటు అలాగే ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. 


Also Read : Jio Bharat b2: 343 గంటల స్టాండ్‌బై బ్యాటరీతో మార్కెట్‌లోకి Jio Bharat B2 మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు!


సోయాబీన్ నూనె, కర్పూరం రెమెడీ:
జుట్టులోని చుండ్రు నుంచి ఉపశమనం పొందడానికి పెరుగుకు బదులుగా నూనెతో కర్పూరాన్ని కూడా వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీనిని కలపడం వల్ల జుట్టు మరింత అదంగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా సులభంగా తగ్గుతుంది. దీంతో పాటు స్కాల్ప్‌పై రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.


 (NOTE: ఈ హోం రెమెడీస్‌కి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు..వినియోగించే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకోవాలి)


Also Read : Jio Bharat b2: 343 గంటల స్టాండ్‌బై బ్యాటరీతో మార్కెట్‌లోకి Jio Bharat B2 మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter