Dandruff Remove Tips: కేవలం ఈ 5 అంశాలు గుర్తుంచుకుంటే చాలు..డాండ్రఫ్ సమస్యకు శాశ్వతంగా చెక్
Dandruff Remove Tips: సీజన్ మారేకొద్దీ ప్రతి ఒక్కరకీ తలలో డాండ్రఫ్ సమస్య వేధిస్తుంటుంది. ఒక్కోసారి తల విదిల్చితే చాలు రాలేంతగా డాండ్రఫ్ ఉంటుంది. ఈ సమస్య కారణంగా జుట్టు రాలుతుంటుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలి. ఆ వివరాలు మీ కోసం..
డేండ్రఫ్ సమస్య నుంచి గట్టెక్కేందుకు చాలా రకాల చిట్కాలున్నాయి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా కొద్దిరోజుల్లోనే తలలో డాండ్రఫ్ సమస్య తొలగిపోతుంది. కేశాలు తిరిగి ఆరోగ్యంగా మారతాయి. దీనికోసం ముఖ్యంగా 5 అంశాల్ని గుర్తుంచుకోవాలి.
డేండ్రఫ్ అనేది సీజన్ మారినప్పుడు తలలో ఏర్పడే ఫంగస్ లాంటిది. దీనివల్ల తలలో విపరీతమైన దురద ఉంటుంది. జుట్టు అదే పనిగా రాలిపోతుంటుంది. అందుకే డాండ్రఫ్ సమస్యను సాధ్యమైంత త్వరగా పోగొట్టుకోవాలి. డేండ్రఫ్ నిర్మూలించేందుకు కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలతో తలలో డాండ్రఫ్ సమస్యను పోగొట్చవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..
తలలో డాండ్రఫ్ తొలగించే సులభమైన మార్గాలు
తలకు నూనె రాయవద్దు
ఒకవేళ మీ తలలో డాండ్రఫ్ సమస్యే ఉంటే పొరపాటున కూడా ఏ రకమైన నూనె రాయవద్దు. ఎందుకంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు నూనె రాయడం వల్ల సమస్య మరింతగా పెరుగుతుంది. అందుకే డాండ్రఫ్ ఉన్నప్పుడు నూనెకు దూరంగా ఉండాలి.
శుభ్రమైన దువ్వెన
డాండ్రఫ్ సమస్యతో బాధపడుతుంటే మీరు వాడే దువ్వెన చాలా శుభ్రంగా ఉండాలి. శుభ్రంగాలేని దువ్వెన పొరపాటును కూడా వాడవద్దు. లేకపోతే డాండ్రఫ్ సమస్య మరింత పెరుగుతుంది.
తల శుభ్రం చేయడం
ఒకవేళ మీకు రోజూ వర్కవుట్స్ లేదా వ్యాయామం చేసే అలవాటుంటే..తలలో మీకు తెలియకుండా చెమట చాలా ఉంటుది. అందుకే అలా ఉన్నప్పుడు తలన్నానం చేసి శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి.
కేశాల శుభ్రత
డాండ్రఫ్ సమస్య పోగొట్టేందుకు మీ స్కాల్ప్ పైభాగం హైజీన్‌గా ఉండేట్టు చూసుకోవాలి. వారంలో కనీసం 3-4 సార్లు తలస్నానం అవసరం. దీనికోసం 2 శాతం కెటకొనోజోల్ లేదా జింక్ పైరిథియాన్ ఆధారిత షాంపూ వినియోగించాలి.
తల కప్పి ఉంచడం
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చాలామంది హ్యాట్ లేదా టోపీ ధరిస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కువసేపు హ్యాట్ తలపై ఉండటం వల్ల తలలో చెమట ఎక్కువగా పడుతుంది. ఇది మీ తలలో డాండ్రఫ్ సమస్య పెంచేందుకు దోహదపడుతుంది.
Also read: Skin Care Tips: చర్మం, కేశాలు సహజ కాంతిని కోల్పోయేది ఈ మూడు అలవాట్లతోనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook