Dark Circles Removal 7 Days: కళ్లు కూడా మూఖానికి అందాన్ని ఇస్తాయి.  అందుకే చాలా మంది ఆకర్షణీయమైన కళ్లు ఉండాలని కోరుకుంటారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో కళ్ల కింద నల్లటి వలయాల సమస్య వస్తున్నాయి. అంతేకాకుండా ముఖం అందహీనంగా తయారవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే బీట్‌రూట్‌తో తయారు చేసిన అండర్ ఐ మాస్క్‌ను వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీట్‌రూట్‌ను అండర్ ఐ మాస్క్ చేయడానికి కావలసిన పదార్థాలు:
½ టీస్పూన్ బీట్‌రూట్ పొడి
 7 నుంచి 8 చుక్కలు బాదం నూనె


తయారి పద్ధతి:
బీట్‌రూట్ పౌడర్ ఐ మాస్క్ చేయడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది.
అందులోనే బీట్‌రూట్‌ పొడి, బాదం నూనె వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ రెండు మిశ్రమాలను బాగా కలుపుకుని పెస్ట్‌లా తయారు చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఓ సిసాలో భద్రపరుచుకుంటే చాలు.


ఇది కూడా చదవండి:  Lavender Oil for Hair: లావెండర్ ఆయిల్‌తో పర్మినెంట్‌గా తెల్ల జుట్టు నల్లగా మారటం ఖాయం! 


అప్లై చేసే విధానం?
బీట్ రూట్ అండర్ ఐ మాస్క్ వేసుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత సిద్ధం చేసుకున్న బీట్‌రూట్ పౌడర్ ఐ మాస్క్‌ను కళ్ల కింద బాగా అప్లై చేయాలి.
తేలికపాటి చేతులతో సుమారు రెండు నిమిషాలు మసాజ్ చేయండి.
5 నుంచి 10 నిమిషాల పాటు ఇలాగే కంటి కింద ఉంచండి.
ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలా సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


ఇది కూడా చదవండి:  Lavender Oil for Hair: లావెండర్ ఆయిల్‌తో పర్మినెంట్‌గా తెల్ల జుట్టు నల్లగా మారటం ఖాయం! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook