ఎడారి ఫ్రూట్‌గా పేరుగాంచిన ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, జింక్, మాంగనీస్ సహా అన్ని పోషక గుణాలు ఉన్న ఏకైక ఫ్రూట్ ఇదే. అందుకే దీనికి అంత డిమాండ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోషక పదార్ధాలు పుష్కలంగా ఉన్న ఖర్జూరంతో చాలా వ్యాధుల్నించి గట్టెక్కవచ్చు. ఇందులో ఉన్న ఫైబర్ కారణంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు దూరమౌతాయి. మరోవైపు గుండె ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది. అంతేకాదు..బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. రోజూవారీ పనులకు కావల్సిన శక్తిని ఖర్జూరం అందిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్నందునే ఖర్జూరాన్ని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో ఉండే సహజసిద్ధమైన స్వీట్‌నెస్ ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, జింక్, మాంగనీస్ వంటి పోషక గుణాల వల్ల కలిగే ఇతర లాభాల గురించి తెలుసుకుందాం..


1. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఇటీవలికాలంలో మగవారిలో లైంగిక సామర్ధ్యం పడిపోతోంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ప్రతి రోజూ 4 ఖర్జూరం పండ్లను పాలతో ఉడికించి..తింటే శరీరం సామర్ధ్యం పెరుగుతుంది. స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. 


2. ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఖర్జూరం తింటే..జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావు. అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు ఖర్జూరం అద్భుతంగా పనిచేస్తుంది. 


3. ఖర్జూరం శరీరం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనికోసం ప్రతిరోజూ  ఖర్జూరం పండ్లను పాలతో కలిపి తినాలి. దీనివల్ల శరీరం బరువు పెరుగుతుంది. పైల్స్ వంటి సమస్యలు తొలగుతాయి. మెదడు చురుగ్గా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.


Also read: Back Pain: చలి కాలంలో వచ్చే ఈ తీవ్ర నొప్పుల నుంచి శాశ్వతంగా ఇలా ఉపశమనం పొందొచ్చు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook