Detox Drinks: శరీరంలో నుంచి శాశ్వతంగా వ్యర్ధపదార్థాలను తొలగించే ఔషధ గుణాలు కలిగిన డ్రింక్ ఇదే..
Detox Drinks: ప్రస్తుతం చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్ధపదార్థాలు పేరుకుపోతున్నాయి. దీనికి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Detox Drinks: మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల శరీరానికి శక్తి లభించి రోజంతా యాక్టివ్ గా ఉండగలుగుతారు. ప్రస్తుతం చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తీసుకోవడం కారణంగా ఆహార రూపంలో శరీరంలోకి మలినాలు విపరీతంగా చేరుతున్నాయి. దీని కారణంగా శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి మూత్రపిండాల్లో తీవ్ర సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఇలాంటి సమస్యల బారిన పడేవారు భారత్లో ప్రతి వంద మందిలో 50 మంది ఉన్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధపదార్థాలను బయటకు పంపించేందుకు తప్పకుండా పలు ఆరోగ్యకరమైన డ్రింక్స్ ను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రింది చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది.
శరీరంలో వ్యర్ధపదార్థాలు పేరుకపోవడం వల్ల రక్తంలో ప్రసరణలో తీవ్ర ఆటంకాలు కూడా కలుగుతాయి. మరికొంతమందిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడి.. చర్మం పై మొటిమలు, రంగు మారడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 8 నుంచి 9 గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధ పదార్థాలు చెమట రూపంలో బయటికి వస్తాయి.
అంతేకాకుండా ప్రతిరోజు నిమ్మకాయ షర్బత్ తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారని.. శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నీ బయటికి వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి చర్మ సమస్యలను కూడా దూరం చేసేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు నిమ్మకాయ నీటిని తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి