Diabetes Control In 7 Days: చక్కెర వ్యాధి అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రతి సంవత్సరం మధుమేహం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఒక్కసారి మధుమేహం బారిన పడితే అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సమస్య రాకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర వ్యాధి  జన్యుపరమైన కారణంగా కూడా వచ్చే అవకాశాలున్నాయి. అయితే తప్పకుండా మధుమేహం ఉన్నవారు పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే కిడ్నీ వ్యాధి, గుండెపోటు అనేక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.  మధుమేహాన్ని నియంత్రించడానికి ఎలాంటి  ఇంటి నివారణలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆకులు ప్రభావవంతంగా ఉంటాయి:
కొన్ని ఆకుల రసాలను క్రమం తప్పకుండా నీటిలో కలిపి తాగితే..రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.


అశ్వగంధ ఆకులు:
అశ్వగంధను ఆయుర్వేదంలో నిధిగా పరిగణిస్తారు. ఇందులో ఉండే గుణాలు అనేక వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి తప్పకుండా ఈ ఆకుల రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.


వేప ఆకులు:
వేప ఆకుల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. దీని ఆకుల్లో మధుమేహాన్ని నియంత్రించే చాలా రకాల మూలకాలుంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు ఈ ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది.


మునగ ఆకులు:
మునగ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో చాలా పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తాగితే సులభంగా మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read :  Samantha Cries: అంతా అయిపోయింది అనిపించింది.. అరుదైన వ్యాధి గురించి చెబుతూ ఏడ్చేసిన సమంత!


Also Read : Bigg Boss Faima : నామినేషన్లో దిగజారుతూనే ఉన్నారు.. ఒళ్లు మరిచిపోతోన్న ఫైమా, శ్రీహాన్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook