Natural Hair Straightener: ఉంగరాల జుట్టుతో బాధపడుతున్నారా..? అయితే ఈ సహజ పద్దతులను పాటించండి!
ఉంగరాల జుట్టు చూడటానికి ఆకర్షణీయంగా కనపడినప్పటికీ.. వాటి వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉంగరాల జుట్టు తొలగించుకోటానికి చాలా డబ్బులు ఖర్చుచేస్తుంటారు. సహజంగా జుట్టును స్ట్రెయిట్ గా మార్చే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.
Natural Straightener: మనలో కొంత మనలో మంది ఉంగరాల జుట్టు వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యల నుండి ఉపశమం పొందటానికి గాను ఉంగరాల జుట్టుని స్ట్రెయిట్ గా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. ఒకవేళ మీరు జుట్టు స్ట్రెయిట్ గా మార్చుకోవడానికి పార్లర్ ల చుట్టూ తిరిగితే మాత్రం మీ జేబుకు బొక్కే పడుతుంది. అలాంటి వారు కొన్ని సహజ పద్దతుల ద్వారా జుట్టుని స్ట్రెయిట్ గా మార్చుకోవచ్చు.
సహజ సిద్ధంగా జుట్టుని స్ట్రెయిట్ గా చేసుకోండి
ప్రస్తుతం కాలంలో మహిళల్లో 'స్ట్రెయిట్ హెయిర్' క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతూ వస్తుంది. ఉంగరాల జుట్టు ఉన్న మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరు జుట్టు స్ట్రెయిట్ చేసుకోటానికి హెయిర్ స్ట్రెయిటెనింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. కొందరైతే పార్లర్ ల చుట్టూ తిరిగి డబ్బు వృధా చేసుకుంటూ ఉంటారు. కానీ సహజమైన స్ట్రెయిట్ వెంట్రుకలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఈ సహజ పద్దతుల ద్వారా స్ట్రెయిట్ గా మారిన జుట్టు దూరం నుండి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సహజంగా వెంట్రుకలను స్ట్రెయిట్ గా మార్చుకోవడానికి గల కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.
వెంట్రుకలను స్ట్రెయిట్ గా మార్చే తేనె - పాల మిశ్రమం:
జుట్టులో కెరోటిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి మరియు జుట్టు కూడా హెల్తీగా ఉంటాడని ప్రోటీన్ చాలా అవసరం. ఈ ప్రోటీన్ పాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. పాలలో ఫ్యాట్ కూడా ఉంటుంది. వీటి వలన స్ట్రెయిట్ గా మారటమే కాకుండా.. మృదువుగా మారుతుంది. ఈ మిశ్రమంలో ఉంటె తేనె జుట్టుకి మెరుపుని కూడా అందిస్తుంది. ఇలా సహజ పద్దతుల ద్వారా జుట్టును స్ట్రెయిట్ చేసుకోవచ్చు.వాటిని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం.
Also Read: Janasena-Tdp: ప్యాకేజ్ బంధం ప్రభావమే ఈ పొత్తు, జనసేన-టీడీపీ పొత్తుపై వైసీపీ విమర్శలు
అవసరమైన పదార్ధాలు:
1 స్పూన్ తేనె
1 కప్పు పాలు
తయారు చేసే విధానం:
ఒక పాత్రలో ఒక టీస్పూన్ తేనె మరియు ఒక కప్పు పాలు వేసుకొని, రెండింటినీ కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.
వెంట్రుకలకు ఎలా అప్లై చేసుకోవాలి
మొదటగా జుట్టును షాంపూతో బాగా ఖడ్గాలు. ఆ తర్వాత తయారు చేసుకున్న పేస్ట్‌ని జుట్టుకు పట్టించాలి. ఈ పేస్ట్ ను జుట్టుకి 5 నిమిషాల పాటు అలాగే ఉంచి.. తర్వాత నీటితో జుట్టును కడగాలి.
బియ్యం పిండి, ముల్తానీ మట్టి మరియు గుడ్డు
గుడ్లు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. గుడ్ల ద్వారా జుట్టును సులభంగా స్ట్రెయిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవైరైన ఉంగరాల జుట్టు కావాలంటే గుడ్డులో గుడ్డులో బియ్యం పిండి కలిపితే చాలు.
అవసరమైన పదార్ధాలు
గుడ్డులోని తెల్లసొన
1/4 కప్పు బియ్యం పిండి
1 కప్పు ముల్తానీ మిట్టి
తయారు చేసే విధానం
ఒక పాత్రలో గుడ్డులోని తెల్లసొన.. 1/4 కప్పు బియ్యం పిండి మరియు 1 కప్పు ముల్తానీ మిట్టిని పాత్రలో వేసుకొని.. బాగా కలపాలి.
వెంట్రుకలకు ఎలా అప్లై చేయాలి
తయారు చేసుకున్న పేస్ట్ ని జుట్టుకి పట్టించి,దువ్వెన తో దువ్వుకోవాలి,దీని వల్ల పేస్ట్ ని జుట్టుకి బాగా పడుతుంది.ఆ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసుకొని గంట వరకు అలాగే ఉంచుకోవాలి.దీని తరువాత సల్ఫేట్ లేని షాంపూ తో జుట్టుని శుభ్రపరచుకోవాలి.ఈ విధానాన్ని వారం పాటు ఉపయోగించడం ద్వారా కొన్ని వారాల్లో జుట్టు స్ట్రెయిట్‌గా మారడాన్ని మీరు గమనిస్తారు.
Also Read: Chandrababu Bail: ఎట్టకేలకు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు, విచారణ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook